నేటి నుంచి ‘పుష్ప 2’ టికెట్ ధరలు తగ్గింపు
హైదరాబాద్:
సినిమా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన ‘పుష్ప 2: ది రూల్’ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ కొనసాగిస్తోంది. విడుదలైన కేవలం మూడు రోజుల్లోనే రూ.621 కోట్ల వసూళ్లను సాధించినట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ నేపధ్యంలో సినిమాను మరింత మంది చూసే అవకాశం కల్పించేందుకు టికెట్ ధరలను తగ్గిస్తున్నట్లు సమాచారం.
కొత్త టికెట్ ధరలు ఇలా ఉన్నాయి:
- సింగిల్ స్క్రీన్:
- సెకండ్ క్లాస్: రూ.80
- ఫస్ట్ క్లాస్: రూ.140
- బాల్కనీ: రూ.200
- మల్టీప్లెక్స్:
- రూ.100 నుంచి రూ.150 వరకు తగ్గింపు
ఈ నిర్ణయం ద్వారా ప్రేక్షకుల స్పందన మరింత పెరగనున్నట్లు ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ‘పుష్ప 2’కు క్రేజ్ తగ్గకుండానే టికెట్ ధర తగ్గింపు ప్రేక్షకులకు మరింత లాభం చేకూర్చనుంది.
