శబరిమలలో మొట్టమొదటి సారిగా పర్యవేక్షణకు సీసీ కెమెరాలు
తిరువనంతపురం:
శబరిమలలో భక్తుల రద్దీ, భద్రత పెరగడంతో మొట్టమొదటి సారిగా పంబా బేస్ క్యాంప్ నుంచి సన్నిధానం వరకు ప్రతి ప్రాంతాన్ని కవర్ చేసేలా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. భక్తుల రక్షణ, భద్రతను మెరుగుపరచడమే లక్ష్యంగా మొత్తం 258 హెచ్‌డీ కెమెరాలను పోలీసులు ఏర్పాటు చేశారు.
ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు?
- పంబా నుంచి శరణగుత్తి వరకూ మార్గంలో రెండు వైపులా
- నడపండల్
- పదినెట్టాంబడి
- సన్నిధానం
- భస్మకులం
స్పెషల్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు:
ఈ సీసీ కెమెరాలను రాత్రింబవళ్లు పర్యవేక్షించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటుచేశారు. దీనివల్ల భక్తుల కదలికలు, ప్రమాదాలు, అనవసరమైన గందరగోళాలను వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవచ్చు.
పోలీసుల ఈ చర్య భక్తులకు సురక్షితమైన యాత్ర అనుభవాన్ని అందించడంలో కీలకంగా మారనుంది.