Breaking News

CM Pujas at Renuka Ellamma Temple

రేణుకా ఎల్లమ్మ ఆలయంలో సీఎం పూజలు

వికారాబాద్, నారాయణపేట జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

వికారాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వికారాబాద్ జిల్లా పర్యటన కొనసాగుతోంది. దుద్యాల్ మండలం పోలేపల్లికి చేరుకున్న సీఎం, అక్కడ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆలయానికి పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం ప్రత్యేక హారతి ఇచ్చారు.

పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు

ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

చిక్కడపల్లి హనుమాన్ ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా..మహేష్ కుమార్ గౌడ్ దంపతుల ప్రత్యేక దర్శనం

నారాయణపేట జిల్లా పర్యటనకు బయల్దేరనున్న సీఎం

🛣️ పోలేపల్లి ఆలయ సందర్శన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లా పర్యటనకు బయల్దేరనున్నారు.

🔹 అప్పకపల్లిలో మహిళలచే నడిచే తొలి పెట్రోల్ బంక్ ప్రారంభం
🔹 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన
🔹 నారాయణపేట మెడికల్ కాలేజీలో అకడమిక్ బ్లాక్, ఇతర భవనాల ప్రారంభోత్సవం
🔹 గురుకుల హాస్టల్ ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగం

హైదరాబాద్‌లో అంతర్జాతీయ సైబర్ స్కామ్: 600 సిమ్ కార్డులు, కోట్ల రూపాయల మోసం

📢 ఈ పర్యటనలో ముఖ్యమంత్రి రాష్ట్రంలోని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. 🚀

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *