Breaking News

The concern of BRS leaders at the assembly gate

అసెంబ్లీ గేటు వద్ద బిఆర్ఎస్ నాయకుల ఆందోళన

అసెంబ్లీ గేటు వద్ద బిఆర్ఎస్ నాయకుల ఆందోళన

హైదరాబాద్:డిసెంబర్ 09
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముందే రగడ రాజుకుంది,అదానీ రేవంత్ దోస్తీ పైన బీఆర్ఎస్ పార్టీ వినూత్న నిరసన చేపట్టింది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

అదానీ రేవంత్ భాయ్ భాయ్ అంటూ టీ షర్టులతో గన్ పార్క్ నుంచి అసెంబ్లీకి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు బయలుదేరారు. ఢిల్లీలో అదానితో కుస్తీ గల్లీలో దోస్తీ అంటూ నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డికి ఎంత చెప్పినా వినడం లేదు అని మాకు టి షర్ట్లు ఇచ్చి అసెంబ్లీలో నిరసన తెలియజేయమన్నారటూ కేటీఆర్ చురకలు వేశారు.

తెలంగాణ తల్లి మాది కాంగ్రెస్ తల్లి నీది అంటూ బీఆర్ఎస్ నాయకులు నినాదాలు చేశారు. బతకమ్మ తీసి చేయి గుర్తు పెట్టిందంటూ నినాదాలు చేశారు. అసెంబ్లీ లోపలికి రానీకుండా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు.

స్పీకర్ డౌన్ డౌన్ అంటూ బీఆర్‌ఎస్ నాయకులు నినాదాలు చేశారు. టీషర్లు తీసివేస్తే లోపలికి అను మతి ఇస్తామని పోలీసులు తెలిపారు. వారితో కేటీఆర్, హారీష్ రావు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *