కేసీఆర్ పై సిట్ విచారణ కు వ్యతిరేకంగా పార్టీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం
నడిగూడెం ,ఫిబ్రవరి 1 (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు కోదాడ నియోజకవర్గ ఇన్చార్జ్ ,మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ ఆదేశాల మేరకు నడిగూడెం మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రివర్యులు కేసీఆర్ ని వ్యక్తిగతంగా అగౌరవపరచడమే ఏకైక లక్ష్యంగా చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, చట్టాలను సైతం లెక్కచేయకుండా న్యాయవ్యవస్థను కించపరుస్తూ సిట్ నోటీసుల పేరుతో దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. సిట్ అధికారుల తీరును నిరసిస్తూ, ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నడిగూడెం మండల కేంద్రంలో ఆదివారం నల్ల బ్యాడ్జీలతో శాంతియుతంగా నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో మండల సమన్వయ నాయకులు అనంతుల ఆంజనేయులు గ్రామ శాఖ అధ్యక్షులు బోనగిరి ఉపేందర్ మాజీ సర్పంచ్ దున్న సుధాకర్ బి ఆర్ ఎస్ నాయకులు దున్న ప్రవీణ్ మహమ్మద్ రఫీ కురాకుల కృష్ణమూర్తి పోలంపల్లి వెంకన్న వల్లెపు శ్రీను మేకల వీరబాబు ఎస్కే జలీల్ దున్న రవి కన్నెబోయిన మురళీకృష్ణ కుంభజడ శ్రీను గంట పంగు సుదీప్ జలగం శివకృష్ణ రంగెల్ల లింగయ్య దున్న ప్రమోదు బడుగుల వెంకటేష్ కన్నెబోయిన నాగబాబు పల్లపు తిరుమల పోలె బోయిన నాగరాజు పాతకోట్ల మహేష్ మండవ అనిల్ దున్న అర్జున్ లక్ష్మయ్య దున్న సురేష్ చిమట మహేష్ తదితరులు పాల్గొన్నారు.

