Breaking News

చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు తగవు

టీడీపీ నాయకుల ధ్వజం.
అంబటి రాంబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలి.

కోదాడ,ఫిబ్రవరి1( నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను కోదాడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఆదివారం కోదాడలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ అనుభవం లేని వ్యక్తులు స్థాయి మరచి మాట్లాడటం సంస్కారం కాదన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిపై అసభ్య పదజాలంతో దూషించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. ప్రజాక్షేత్రంలో పట్టు కోల్పోయిన వారే ఇలాంటి విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు ఓరుగంటి ప్రభాకర్, ముత్తినేని సైదేశ్వరరావు, భయ్యా నారాయణ, కొల్లు నరసయ్య, సాతూలూరి గురవయ్య, జనపనేని కృష్ణ, కోల్లు వెంకటేశ్వరరావు, గుండు నాగేశ్వరరావు, వనపర్తి నాగేశ్వరరావు, మైకు నాగులు, చల్లా గురవయ్య, డాక్టర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

ఏపీలో సూపర్ న్యూస్.. మహాశివరాత్రి సందర్భంగా సోమవారం ఆప్షనల్ హాలీడే.

భారత్ ఎక్కువగా ఏ దేశాల నుంచి బంగారం దిగుమతి చేసుకుంటుంది? టాప్ 5 లిస్ట్ ఇదే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *