బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

హీట్ ఎక్కుతున్న ఏపీ రాజకీయాలు.. నిబంధనలు అందరికీ ఒకటేనన్న సీఎం చంద్రబాబు

నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో వైసీపీ నేత అంబటి రాంబాబుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయనను పోలీసులు రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించారు. వరుస ఘటనల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

ఈ పరిణామాలపై సీఎం చంద్రబాబు ఘాటుగా స్పందించారు. రాజకీయాలను నేరాల వైపు నడిపిన సంస్కృతి వైసీపీదేనని విమర్శించారు. వైసీపీ పాలనంతా చట్టరహితంగా కొనసాగిందని, అలాంటి పరిస్థితులకు 2024 ఎన్నికలతో ప్రజలు ముగింపు పలికారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మళ్లీ రూల్ ఆఫ్ లా అమలులోకి వచ్చిందని తెలిపారు.

ప్రజల సాధికారతే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. వైసీపీ గతంలో చేసిన తప్పులు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని, అందుకే ఆ పార్టీ నిరాశ, అసహనంతో వ్యవహరిస్తోందని అన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణాన్ని చూసి వైసీపీ తట్టుకోలేకపోతున్నదని ట్వీట్‌లో విమర్శించారు.శాంతి భద్రతలను కాపాడే విషయంలో ఎలాంటి రాజీ ఉండదని చంద్రబాబు స్పష్టం చేశారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా నిబంధనలు అందరికీ ఒకటేనని తెలిపారు. హద్దులు దాటి ప్రవర్తిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు