Breaking News

What's that retailer wearing tichers?

టీషర్ట్లు వేసుకుని ఆ చిల్లర ఏంటి?

సోనియమ్మకు జన్మదిన శుభాకాంక్షలు కూడా చెప్పని కేసీఆర్: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

హైదరాబాద్: డిసెంబర్ 09
కాంగ్రెస్ నేత మరియు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సోనియాగాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని కనీసం శుభాకాంక్షలు చెప్పడం కూడా కేసీఆర్‌కు అలవాటు లేదని ఆయన వ్యాఖ్యానించారు.

తెలంగాణకు అదనపు నిధుల కోసం కేంద్రాన్ని కలిసిన భట్టి

తెలంగాణను సాధించడంలో కీలక పాత్ర పోషించిన సోనియమ్మకు కనీస గౌరవం కూడా చూపించకపోవడం దారుణమని అన్నారు. “తెలంగాణను ఇచ్చిన సోనియమ్మను గౌరవించలేని వ్యక్తులకు తెలంగాణతల్లి విగ్రహం గురించి మాట్లాడే అర్హత ఏమిటి?” అని కోమటిరెడ్డి ప్రశ్నించారు.

“టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చినప్పుడే మీకు తెలంగాణతో సంబంధం తెగిపోయింది” అని తీవ్రంగా విమర్శించారు. ప్రజల ఆకాంక్షల నుంచి టీఆర్‌ఎస్ దూరమైందని, ఇప్పుడు బీఆర్‌ఎస్‌ పేరుతో రాష్ట్ర ప్రజల హక్కులను కాదని జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం అనేది చరిత్ర మర్చిపోదని అన్నారు.

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ట్రైనీ ఐఏఎస్ అధికారులు

కేసీఆర్‌ ధరించే డ్రెస్సింగ్ స్టైల్‌పై కూడా కోమటిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. “టీషర్ట్లు వేసుకుని ఆ చిల్లర ఏంటి?” అంటూ విమర్శించారు. ప్రజా నాయకులు తమ పద్ధతుల్లో ఒక సంస్కారం చూపించాల్సిన బాధ్యత ఉంటుందని, కానీ కేసీఆర్ మాత్రం ఆ దిశగా దారితప్పుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *