Breaking News

కేవలం 3 గంటల్లో చెన్నై, బెంగళూరు.. అమరావతికి 75 నిమిషాలు

తెలుగు రాష్ట్రాల మీదుగా హైస్పీడ్ రైల్ కారిడార్లు – బడ్జెట్‌లో కేంద్రం కీలక ప్రకటన

నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్ చెప్పింది. హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకుని చెన్నై, బెంగళూరు, పుణెకు హైస్పీడ్ రైల్ కారిడార్లు నిర్మించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

ఈ ప్రాజెక్టులు పూర్తయితే, దీర్ఘ ప్రయాణాలకు గుడ్‌బై చెప్పే అవకాశం ఉంటుంది. కేవలం 3 నుంచి 4 గంటల్లోనే చెన్నై, బెంగళూరు, పుణె చేరుకోవచ్చు. అలాగే అమరావతికి 75 నిమిషాలు, అనంతపురానికి 90 నిమిషాల్లో ప్రయాణం చేయొచ్చు.

పీఎం కిసాన్ విడుదలపై కీలక అప్డేట్..

తెలుగు రాష్ట్రాలకు మూడు హైస్పీడ్ కారిడార్లు

దేశవ్యాప్తంగా మొత్తం 7 హైస్పీడ్ రైల్ కారిడార్లు ప్రతిపాదించగా, వాటిలో హైదరాబాద్ నుంచి మూడు కారిడార్లు ఉండటం విశేషం. దీని ద్వారా భవిష్యత్తులో హైదరాబాద్ రైల్వే హబ్‌గా మారనుందని నిపుణులు చెబుతున్నారు.


ప్రతిపాదిత రూట్లు

  • హైదరాబాద్ – చెన్నై హైస్పీడ్ కారిడార్:
    శంషాబాద్ – సూర్యపేట – ఖమ్మం – అమరావతి మార్గంలో
  • హైదరాబాద్ – బెంగళూరు హైస్పీడ్ కారిడార్:
    శంషాబాద్ – మహబూబ్‌నగర్ – వనపర్తి – శ్రీశైలం మార్గంలో
  • హైదరాబాద్ – ముంబై హైస్పీడ్ కారిడార్:
    జహీరాబాద్ – కలబురిగి – సోలాపూర్ – పుణె మార్గంలో
    (ఈ మార్గానికి సంబంధించి ఇప్పటికే డీపీఆర్ సిద్ధమైనట్లు సమాచారం)

గంటకు 350 కి.మీ వేగం

ఈ హైస్పీడ్ రైల్ కారిడార్లు పూర్తయిన తర్వాత గంటకు 350 కిలోమీటర్ల వేగంతో రైళ్లు నడిపే అవకాశం ఉంది. ఈ రైళ్లలో ఏసీ కోచ్‌లే అందుబాటులో ఉండనున్నాయి. అయితే ప్రయాణ ఛార్జీలు సాధారణ రైళ్లతో పోలిస్తే కొంత ఎక్కువగా ఉండవచ్చని అంచనా.

భారీగా పడిపోయిన చికెన్ ధరలు.. కేజీ ఎంతంటే?

అభివృద్ధికి దారితీసే ప్రాజెక్ట్

హైస్పీడ్ రైళ్లతో:

  • తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడులు పెరిగే అవకాశం
  • లాజిస్టిక్స్, హోటల్, టూరిజం రంగాలకు ఊతం
  • వేలాది ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని కేంద్రం భావిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *