బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

పల్లెటూరిలో మెరిసిన ఆణిముత్యంగ్రూప్-1 లో రాకేష్ రెడ్డి ప్రతిభ- డి ఎస్ పి గా ఎంపిక

పులివెందుల ఫిబ్రవరి 2 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): కడప జిల్లా వేముల మండలం గొల్లల గూడూరు గ్రామానికి చెందిన రాకేష్ రెడ్డి డి.ఎస్.పి గా నియమితులయ్యారు. చదువులు పట్టణాలకే పరిమితం కాదని ఆయన తన ప్రతిభతో నిరూపించారు. కష్టపడితే గమ్యం చేరుకోవచ్చని గ్రామీణ యువతకు ఆదర్శంగా మారారు. యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి అసిస్టెంట్ డైరెక్టర్‌గా సేవలందిస్తున్నారు. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన రాకేష్ రెడ్డి ఈ స్థాయికి చేరడం గ్రామానికి గర్వకారణంగా మారింది. చిన్ననాటి నుంచే చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన ఆయన లక్ష్య సాధనలో వెనుకడుగు వేయలేదు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఆయనకు బలంగా నిలిచింది. గ్రామంలో ఆయన సాధించిన విజయంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. యువత ఆయన బాటలో నడవాలని పెద్దలు ఆకాంక్షిస్తున్నారు. పల్లెటూరి నుంచే దేశస్థాయికి ఎదగవచ్చని రాకేష్ రెడ్డి చాటి చెప్పారు. కడప జిల్లా, వేముల మండలం, గొల్లల గూడూరు గ్రామానికి చెందిన స్వర్గీయ ఎద్దుల నాగభూషి గారి వీరారెడ్డి (కరణం) మనవడు, ప్రముఖ లాయర్ ఎద్దుల నాగభూషణ రెడ్డి, భాగ్యలక్ష్మి దంపతుల కుమారుడు రాకేష్ రెడ్డి గ్రూప్ 1 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి డీ.ఎస్పీగా (డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు) ఎంపిక అయ్యారు. ఆయన సాధించిన విజయం గొల్లల గూడూరు గ్రామంతోపాటు, జిల్లాలోని యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది. కుటుంబ సభ్యులు, స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తూ, అభినందనలు తెలిపారు. ప్రస్తుతం రాకేష్ రెడ్డి యు పి ఎస్ సి లో ఉత్తీర్నత సాధించి అసిస్టెంట్ డైరెక్టర్ గా మై భారత్ లో(సెంట్రల్ గవర్నమెంట్) సేవలను అందిస్తున్నారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు