బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

సమష్టి కృషితో వాతావరణం కాలుష్యాన్ని నివారిద్దాం: టిడిపి మండల కన్వీనర్ రామమునిరెడ్డి

పులివెందుల ఫిబ్రవరి 2 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): సమిష్టి కృషితో వాతావరణ కాలుష్యాన్ని నివారిద్దామని టిడిపి మండల కన్వీనర్ రామ మునిరెడ్డి పిలుపునిచ్చారు. టిడిపి పులివెందుల ఇన్ ఛార్జ్ బిటెక్ రవీంద్రనాథ్ రెడ్డి ముందస్తు పుట్టిన రోజు సందర్భంగా సోమవారం స్థానిక రామలింగయ్య కాలనీతో పాటు ఆయా ప్రాంతాల్లో టిడిపి క్లస్టర్ ఇన్ ఛార్జ్ మహమ్మద్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ నేపథ్యంలో టిడిపి మండల కన్వీనర్ రామమునిరెడ్డి మొక్కలను నాటి కార్యక్రమాన్ని ప్రారభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం సంతోషకరమని చెప్పారు. టిడిపి నేత బిటెక్ రవి పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకుని ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయం అన్నారు. సేవా కార్యక్రమాలు చేసేందుకు మహమ్మద్ ముందు ఉంటాడని కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. బిటెక్ రవి సారథ్యంలో పులివెందుల నియోజకవర్గం అభివృద్ధి బాటలు చేస్తున్నట్లు చెప్పారు. పచ్చదనం ఉంటేనే గ్రామం కూడ పచ్చగా ఉంటుందని కాబట్టి విరివిరీగా మొక్కలు నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ క్లస్టర్ ఇన్ ఛార్జ్ మహమ్మద్ ఇనాయతుల్లా, టిడిపి నేతలు ఫయాజ్ (యంగ్ బాయ్) ఎద్దుల రాము, అతికారి రమణ, కరీ ముల్లా, జబీబుల్లా, శివ, బాలకృష్ణ రెడ్డి, ఇస్మాయిల్, సాయి, వెంకట రామిరెడ్డి, వెంకట శివ, తిరుమల్ రెడ్డి, షఫీ, అంజి పాల్గొన్నారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు