Breaking News

ప్రజా గొంతుక సిపిఎం ను గెలిపించండి

కోదాడ, ఫిబ్రవరి 2(నేటి తెలుగు పత్రిక ): ప్రజా సమస్యల పరిషత్కారం కోసం నిరంతరం పోరాడుతున్న సిపిఎం పార్టీని కోదాడ మున్సిపాలిటీలో గెలిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ములకలపల్లి రాములు విజ్ఞప్తి చేశారు.సోమవారం మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో పోటీ చేసిన కుక్క డప్పు నలిని ప్రసాద్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు. 9వ వార్డులో పోటీ చేసిన మిట్టగడుపుల ముత్యాలు ను, 8 వార్డులో పోటీచేసిన నక్క కుమారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సిపిఎం పార్టీ ఎల్లప్పుడు కార్మిక కర్షక ఉద్యోగ ఉపాధ్యాయ పేదల ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతుందని వారన్నారు ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజా గొంతుకైనా సిపిఎం ను గెలిపించాలని కోరారు కోదాడలో మున్సిపాలిటీ పరిధిలో అపరిస్కృతంగా ఉన్నటువంటి సమస్యల కోసం పోరాడతామని వారన్నారు. ఈ ఎన్నికల్లో డబ్బు మద్యం పంపిణీ చేసే పార్టీలను ఓడించాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎస్ కే సైదా, బెల్లంకొండ సత్యనారాయణ, రాపోలు సూర్యనారాయణ అలసగాని బ్రహ్మయ్య, సిపిఎం పట్టణ నాయకులు కర్ణ కోటి నవీన్, గొర్రె ముచ్చు నక్క గోపి, వేమ నారాయణ ,జంగపల్లి శ్రీను ,వెలిది పద్మావతి, నక్క నవీన్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా సీనియర్ జర్నలిస్ట్ సత్య జన్మదిన వేడుకలు

ఎల్‌పీజీ కొరతపై కేంద్రానికి రాష్ట్ర విజ్ఞప్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *