Breaking News

క‌ల్తీ నెయ్యి లో జంతు అవ‌శేషాలు వున్నాయ‌ని ఎన్.డి.డి.బి నిర్ధారించింది..!

రాష్ట్ర టిడిపి నాయ‌ కులు మాదిగాని గురు నాథం వెల్ల‌డి…!

విజ‌య‌వాడ. ఫిబ్రవరి 2 ఈస్ట్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి….!

గీతవృత్తిలో ప్రమాదాలకు గురై గీత కార్మికులకు రావలసిన ఎక్స్ గ్రేషియాలకు నిధులు విడుదల చేయాలి.

వైసిపి హ‌యంలో తిరు మ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ల‌డ్డు ప్ర‌సాదంలో వాడిన క‌ల్తీ నెయ్యిలో జంతు అవ‌శేషాలు వున్నాయ‌ని ఎన్.డి.డి.బి నిర్ధారించిందని టిడిపి రాష్ట్ర నాయ‌కు లు మాదిగాని గురునాథం తెలిపారు. క‌ల్తీ నెయ్యి విష‌యంలో వైసిపి నాయ‌కులు చేస్తున్న దుష్ప్ర‌చారాన్ని ఖండిస్తూ దేశ ప‌గ్ర‌తితో పాటు రాష్ట్రా భివృద్దికి దోహ‌దం చేసే విధంగా కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన కేంద్ర బ‌డ్జెట్ 2026 ను స్వాగ‌తిస్తూ ఈ సందర్భంగా సోమ‌వారం గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ కార్యాల‌యంలో మాదిగాని గురునాధం విలేకరుల స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సమా వేశంలో ఆయ‌న మాట్లాడు తూ ఎంఎస్ఎమ్ ఈలు, హ్యాండ్లూమ్, టెక్ట్స్ టైల్స్, బ‌యో ఫార్మా, అరుదైన ఖ‌నిజాలు, త‌యారీ రంగం, ప్ర‌త్యేక ఆర్ధిక మండ‌ళ్లు (ఎస్.ఈ.జెడ్స్) త‌దిత‌ర రంగాల‌కు ప్రోత్సాహ‌కాల ద్వారా ఉపాధి క‌ల్ప‌న ఈ బ‌డ్జెట్ తోడ్ప‌డుతుంద‌న్నారు. రైతులు, మ‌త్య్సకారులు, నేత కార్మికులు, దివ్యాంగులు, మ‌హిళ‌లు, యువ‌త సంక్షేమ కోసం ప్ర‌క‌టించిన ప‌లు చ‌ర్య‌లు ఈ బ‌డ్జెట్ యొక్క మాన‌వీయ కోణాన్ని ఆవిష్క‌రించా య‌న్నారు. ఎంపీ కేశినేని శివ‌నాథ్ విజ‌య‌వాడ పార్ల మెంట్ నియోజ‌క‌వ‌ర్గ అభి వృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నార‌ని పేర్కొన్నారు. వైసిపి నాయ‌కులు నోరు అదుపులో పెట్టుకోని మాట్లాడాల‌ని హెచ్చ‌రించారు. డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ కి అల‌వాటుప‌డ్డ ఎమ్మెల్యే జ‌గ‌న్ త‌న బ్యాచ్ తో రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌ ల‌కు విఘాతం క‌లిగించ‌టా నికి ఒక ప్ర‌ణాళిక బ‌ద్దంగా ప్ర‌య‌త్నిస్తున్నార‌ని అయితే వైసిపి నాయ‌కులు డ్రామాలు అర్ద‌మైన‌ ప్ర‌జ‌లు వాస్త‌వాలు గ్ర‌హిస్తున్నార‌న్నారు. రాబోయే రోజుల్లో వైసిపి రాష్ట్రంలో భూస్థాపితం కావ‌టం ఖాయ‌మ‌న్నారు. ఈకార్య‌క్ర‌మంలో టిడపి ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి ప‌రిశ‌పోగు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

క్రీడా పోటీలు మహిళా క్రీడాకారిణుల్లో ఆత్మవి శ్వాసాన్ని పెంపొందిస్తాయి: మంత్రి మండిపల్లి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *