Breaking News

ఘనంగా రేణుకా ఎల్లమ్మ ఆలయంలో వార్షికోత్సవ వేడుకలు

  • శివపార్వతుల కళ్యాణం, రేణుక ఎల్లమ్మ జమదగ్ని కళ్యాణ మహోత్సవం,సామూహిక కుంకుమార్చనలు.

యాదగిరిగుట్ట,ఫిబ్రవరి 02 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదగిరిగుట్ట భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో కాచారం కైలాసపురంలో శ్రీ వాసవి రేణుక బసవలింగేశ్వర స్వామి ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు వాసవి పోషకులు డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి ఆధ్వర్యంలో ఆదివారం ఆలయ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించి శివపార్వతుల కళ్యాణం రేణుక ఎల్లమ్మ జమదగ్ని కళ్యాణం సామూహిక కుంకుమార్చనలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలతో పాటు మహా అన్నప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా వంగపల్లి అంజయ్య స్వామి మాట్లాడుతూ దైవ నామస్మరణతోనే మానవ జీవితానికి ముక్తి కలుగుతుందని ప్రతి ఒక్కరు దైవభక్తి కలిగి ఉండాలని శ్రీ గౌరీ రేణుక వాసవి బసవ లింగేశ్వర స్వామి ఆలయం వార్షికోత్సవ వేడుకలకు సహకరించిన ప్రతి ఒక్కరికి దేవదేవతల ఆశీర్వాదం ఉంటుందని అన్నారు, ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు భక్తులను భక్తి మార్గం వైపు పయనింపజేస్తూ ప్రతి మంగళవారం భక్తులకు మహా అన్న ప్రసాదం అందజేస్తూ ఆలయ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించిన వంగపల్లి అంజయ్య స్వామి అభినందనీయులు అని అన్నారు. ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో ఐ హెచ్ ఆర్ సి ఐ నేషనల్ ప్రెసిడెంట్ కటకం శ్రీనివాస్,రాష్ట్ర అధ్యక్షులు వాడకట్టు శ్రీకాంత్ గుప్తా,జాతీయ రాష్ట్ర నాయకులు ఎల్లంకి వీరేశం, శ్రీమతి దివ్య, మీడియా కమిటీ చైర్మన్ సామ శ్రీధర్ సిద్దిపేట జిల్లా మహిళా అధ్యక్షురాలు ప్రశాంతి దంపతులు, భువనగిరి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కూకటపు చంద్రశేఖర్, బిజ్జాల శ్రీనివాస్ రవీందర్ గుప్తా, శ్రీనివాస్ గుప్తా,సముద్రాల రవి,శ్రీనివాస్,సిద్దిపేట జిల్లా యూత్ ప్రెసిడెంట్ గజవాడ సాయి తేజ పలువురు రాష్ట్ర జిల్లా ఐ హెచ్ ఆర్ సి ఐ నాయకులు, ఎల్వి సేవా వేదిక చైర్మన్ ఎల్వీ కుమార్ దంపతులు, గజ్వేల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సముద్రాల హరినాథ్, సిద్ది బిక్షపతి, ఎర్రం శ్రీనివాస్, తోట బిక్షపతి, శ్రీనివాస్ రావు,వెంకటేశం, పెద్ది శ్రీనివాస్,యాదగిరిగుట్ట ఆర్యవైశ్య సత్రం ప్రధాన కార్యదర్శి ఉప్పల రమేష్ గుప్తా దంపతులు, గజ్వేల్ జగదేవపూర్ సిద్దిపేట కు చెందిన పలువురు ఆర్యవైశ్య నాయకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

గీతవృత్తిలో ప్రమాదాలకు గురై గీత కార్మికులకు రావలసిన ఎక్స్ గ్రేషియాలకు నిధులు విడుదల చేయాలి.

క్రీడా పోటీలు మహిళా క్రీడాకారిణుల్లో ఆత్మవి శ్వాసాన్ని పెంపొందిస్తాయి: మంత్రి మండిపల్లి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *