బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

పోలింగ్, కౌంటింగ్ ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు

  • నగరపాలక సంస్థ కమిషనర్ ప్రపూల్ దేశాయ్

కరీంనగర్ : పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియను పోలీస్ బంధోబస్తు మద్య ప్రశాంతంగా నిర్వహించేలా తగిన చర్యలు తీస్కోవడం జరుగుతుందని కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అన్నారు. ఈరోజు నగరంలోని ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో ప్రెసిడింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ప్రెసిడింగ్ ఆఫీసర్లకు కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ సమక్షంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాస్టర్ ట్రైనర్లు సంపత్, అమరేంధర్ లు 11న జరగబోయే పోలింగ్ ప్రక్రియలో పోలింగ్ ముందు రోజు, పోలింగ్ రోజు నిర్వహించాల్సిన విధుల పట్ల వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ…. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ పిఓలు, ఏపిఓలు, పోలింగ్ సిబ్బంది పోలింగ్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని అన్నారు. పోలింగ్ కేంద్రాలలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదని హెచ్చరించారు. ఎన్నికల నిబంధనలను అనుసరించి ప్రతి విషయాన్ని క్లుప్తంగా పరిశీలించాలన్నారు. మొదటగా పోలింగ్ అధికారి ప్రతి ఓటర్ ను ఎన్నికల సంఘం సూచించిన 18 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా ఒక ఓరిజినల్ గుర్తింపు కార్డుతో మాత్రమే ఓటుకు అనుమతించాలన్నారు. ఏజెట్ల అనుమతితోనే ఓటు వేయడానికి ఓటర్ ను అనుమతించాలన్నారు. ఓటర్ కు ఇంకు అప్లై చేసిన తర్వాతే బ్యాలెట్ పేపర్ ను ప్రొసిజర్ ప్రకారం మడిచి ఇచ్చి ఓటు వేయడానికి అనుమతించాలని సూచించారు. ఏ పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఇబ్బందులు రాకుండా పివోలు, ఏపిఓలు, పోలింగ్ సిబ్బంది తగిన జాగ్రత్త చర్యలు తీస్కోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిసీ ఖాధర్ మొహియుద్దీన్, మాస్టర్ ట్రైనర్లు అమరేంధర్, సంపత్, పోలింగ్ అధికారులు పాల్గొన్నారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు