Breaking News

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై సీపీ సమీక్ష

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి సభా ప్రాంగణ పరిశీలన.

కరీంనగర్: ఈ నెల 5వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కరీంనగర్ జిల్లా పర్యటనను పురస్కరించుకుని ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం నాడు చొప్పదండి నియోజకవర్గంలోని గుమ్లాపూర్ సభా ప్రాంగణం, హెలిపాడ్ మరియు పార్కింగ్ స్థలాలను స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి పోలీస్ కమిషనర్ (సీపీ) క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
సభా ప్రాంగణ మ్యాప్ ఆధారంగా భద్రతా పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను, బారికేడ్ల నిర్మాణ శైలిని సీపీ పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పటిష్టమైన బారికేడ్ విధానాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.సభా ప్రాంగణం మరియు పరిసర ప్రాంతాలను డ్రోన్ కెమెరాల ద్వారా క్షుణ్ణంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా భద్రతా ఏర్పాట్లు మరియు భౌగోళిక పరిస్థితులను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు వివరించారు.సభకు వచ్చే వాహనాల కోసం కేటాయించిన పార్కింగ్ స్థలాలను పరిశీలించి, ట్రాఫిక్ జామ్ కాకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, ఎక్కడా చిన్నపాటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని సీపీ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, రెవెన్యూ సిబ్బంది మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు

పోక్సో కేసులో హైకోర్టును ఆశ్రయించిన బండి భగీరథ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *