Breaking News

ప్రభుత్వ వైద్యశాలల్లో గర్భిణీ స్త్రీల ప్రసవాలు జరిగేలా అవగాహన కల్పించాలి.

ఎన్టీఆర్ జిల్లా వైద్యశాఖాధికారిణి డా. ఎం. సుహాసిని వెల్లడి.

ఎ. కొండూరు ఫిబ్రవరి 2 (నేటి తెలుగు పత్రిక): గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణీ స్త్రీలు ప్రసవాలకు కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లకుండా ప్రభుత్వ వైద్యశాలలో ప్రసవాలు జరిగేలా అంగన్వాడీలు ఎం ఎల్ హెచ్ పీ లు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు గర్భిణీ స్త్రీలకు వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలని . కార్పోరేట్ వైద్యం వద్దు ప్రభుత్వ వైద్యం ముద్దు అనే విధంగా విస్తృతమైన ప్రచారాన్ని నిర్వహించాలని ఎన్టీఆర్ జిల్లా వైద్య శాఖా ధికారిణి డాక్టర్ ఎం సుహాసిని అన్నారు.
మండల కేంద్రమైన ఎ. కొండూరు మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో సోమవారం జిల్లా వైద్య శాఖా ధికారిణి డాక్టర్ ఎం. సుహాసిని,ప్రాథమిక వైద్యశాల డాక్టర్లు మరియు సిబ్బందితో మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణీ స్త్రీల నమోదును అంగన్వాడీ సెంటర్లలో అంగన్వాడీ కార్యకర్తలు నమోదు చేయటం జరుగుతుందని ఆమె అన్నారు. అలాంటప్పుడు గర్భిణీ స్త్రీల విషయంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు కు ఎందుకు రావడం లేదని ఆమె ఏ ఎన్ ఎం లను ఆశా వర్కర్లను అంగన్వాడీ కార్యకర్తలను ప్రశ్నించారు. గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణీ స్త్రీలకు సరైన అవగాహన కల్పించాలని ఆమె చెప్పారు ప్రభుత్వ ఆసుపత్రులలో నాణ్యత ప్రమాణాలతో వైద్యం చేయడం జరుగుతుందని ఆమె అన్నారు. విద్యా వైద్యం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ఈ రోజున ప్రభుత్వం ప్రభుత్వ వైద్యశాలలను తీర్చిదిద్దిందని ఆమె చెప్పారు. కార్పొరేట్ ఆసుపత్రులలో నార్మల్ డెలివరీలు చేయడం లేదని కాని ప్రభుత్వ ఆసుపత్రిలో సాధ్యమైనంత వరకు నార్మల్ డెలివరీలు అయ్యే విధంగా అక్కడ పనిచేస్తున్న డాక్టర్లు చర్యలు తీసుకుంటున్నారని ఆమె చెప్పారు ఒకప్పుడు ఎ. కొండూరు ప్రాథమిక వైద్యశాలలో నెలకు 40 మంది గర్భిణీ స్త్రీలకు డెలివరీలు జరిగేవని కాని ఇప్పుడు ఆ పరిస్థితి స్థానిక ప్రాథమిక వైద్యశాలలో కనబడడం లేదని ఆమె సిబ్బంది తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కార్పొరేట్ ఆసుపత్రులలో ప్రసవాలు చేయాలంటే 70 వేల నుండి లక్ష వరకు ఖర్చు అవుతుందని కాని ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక్క రూపాయి లేకుండా ఉచితంగా గర్భిణీ స్త్రీలకు వైద్యం అందించే విషయాన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న గర్భిణీ స్త్రీలకు చక్కగా వివరించి చెప్పాలని ఆమె సిబ్బందికి సూచించారు. అలానే రోజువారి జరిగే మెడికల్ క్యాంపుల్లో గర్భిణీ స్త్రీలను తీసుకురావాలని అన్నారు కార్పొరేట్ ఆసుపత్రులకు గర్భిణీ స్త్రీలు వెళ్తే అక్కడ రక్త పరీక్షలకు రూ 5 వేల వరకు ఖర్చు అవుతుందని కానిప్రభుత్వ వైద్యశాలలో రూపాయి ఖర్చు లేకుండా అన్ని రక్త పరీక్షలు ఉచితంగా చేసే విషయాన్ని గర్భిణీ స్త్రీలకు తెలియ చెప్పాలని ఆమె సిబ్బందికి సూచించారు గర్భిణీ స్త్రీల విషయంలో మండలంలో ఏ ఒక్క గ్రామంలోనూ అలసత్వం వహించకుండా చూడాలని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా తమ వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాలని ఆమె చెప్పారు గర్భిణీ స్త్రీల విషయంలో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఆమె హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీ ఎం అండ్ హెచ్ ఓ, జె, ఇందుమతి దేవి, డి ఐ ఓ, శరత్ బాబు, ఎంపీడీవో, బి శ్రీనివాసరావు, సిడిపిఓ, కే. కృష్ణకుమారి, సూపర్వైజర్స్, షేక్ బాజీ, చైతన్య భవాని, ప్రాథమిక వైద్యశాల మెడికల్ ఆఫీసర్స్ డా. స్వాతి, డా, దివ్య, సిహెచ్ఓ, పీటర్, తోపాటు అంగన్వాడీలు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

గీతవృత్తిలో ప్రమాదాలకు గురై గీత కార్మికులకు రావలసిన ఎక్స్ గ్రేషియాలకు నిధులు విడుదల చేయాలి.

క్రీడా పోటీలు మహిళా క్రీడాకారిణుల్లో ఆత్మవి శ్వాసాన్ని పెంపొందిస్తాయి: మంత్రి మండిపల్లి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *