Breaking News

చట్టాన్ని గౌరవించాలి – సంయమనం పాటించాలి: టీడీపీ

శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు

మంగళగిరి ఫిబ్రవరి 02 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారి సూచనలతో పార్టీ శ్రేణులతో టెలికాన్ఫిరెన్స్ నిర్వహించామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తెలిపారు.

నిన్న జరిగిన కొన్ని సంఘటనలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారని చెప్పారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో చట్టాలను కాలరాస్తూ, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని అరాచక పాలన సాగించారని గుర్తు చేశారు. అలాంటి పాలనను ప్రజాస్వామ్యబద్ధంగా వ్యతిరేకించామని, అయితే ఇప్పుడు మనమే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరైన మార్గం కాదని స్పష్టంగా చెప్పారు.సోషల్ మీడియాలో జరుగుతున్న రెచ్చగొట్టే వ్యాఖ్యలకు , ప్రేరణలకు లోనై స్పందించాల్సిన అవసరం లేదని పార్టీ శ్రేణులకు సూచించారు. తెలుగుదేశం పార్టీకి స్పష్టమైన సిద్ధాంతం, ప్రజాస్వామ్య విలువలు ఉన్నాయని, చట్టాన్ని గౌరవించే పార్టీగా టీడీపీకి సమాజంలో మంచి పేరు ఉందని అన్నారు. అదే మన పార్టీకి ఉన్న బలమైన బ్రాండ్ ఇమేజ్ అని స్పష్టం చేశారు.

వికసిత్ భారత్ – స్వర్ణాంధ్ర 2047 దిశగా కేంద్ర బడ్జెట్

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వికసిత్ భారత్ లక్ష్యాలకు, స్వర్ణాంధ్ర–2047 దిశగా రూపొందించబడిందని పల్లా శ్రీనివాసరావు తెలిపారు. అమరావతి అభివృద్ధికి రూ.1,088 కోట్లు, పట్టణాభివృద్ధికి రూ.452 కోట్లు, గ్రామీణ రోడ్లకు రూ.500 కోట్లు, గూగుల్–రిలయన్స్ డేటా సెంటర్లకు పన్ను రాయితీలు, అరుదైన ఖనిజాల అభివృద్ధికి రూ.1,000 కోట్లు కేటాయించడాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఆంధ్రప్రదేశ్ ఐటీ, డేటా హబ్‌గా అవతరణ

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని చెప్పారు. పోలవరం, అమరావతి, అరకు వంటి డిమాండ్ ప్రాజెక్టులు మాత్రమే కాకుండా, రూరల్–అర్బన్ ప్రాంతాలన్నీ ఎకనామిక్ హబ్‌లుగా మారబోతున్నాయని తెలిపారు. ఇది పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి నిరంతర కృషి వల్లనే సాధ్యమవుతోందన్నారు.ఆంధ్రప్రదేశ్ త్వరలోనే ఐటీ, డేటా హబ్‌గా మారబోతోందని, డేటా సెంటర్లకు 20 నుంచి 40 ఏళ్ల వరకు పన్ను మినహాయింపులు ఇవ్వడం రాష్ట్రానికి వరమని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పార్కులకు ఇచ్చిన రాయితీలు పరిశ్రమలు, ఉపాధికి మరింత ఊతమిస్తున్నాయని చెప్పారు.

గీతవృత్తిలో ప్రమాదాలకు గురై గీత కార్మికులకు రావలసిన ఎక్స్ గ్రేషియాలకు నిధులు విడుదల చేయాలి.

యువతకు భరోసా – డబుల్ ఇంజిన్ సర్కార్ బలం

రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుండటం వల్ల యువతకు భవిష్యత్తుపై గట్టి భరోసా ఏర్పడిందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం, రాష్ట్రం సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు.

స్కిల్ కేసులో చంద్రబాబుకు క్లీన్ చిట్ – కుట్ర బట్టబయలు

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదని సిట్ స్పష్టంగా తేల్చడం శుభసూచకమని పేర్కొన్నారు. మొదట మూడు వేల కోట్లన్నారు, తర్వాత రెండు వేల కోట్లన్నారు, చివరికి ఎలాంటి లావాదేవీలు జరగలేదని సిట్ క్లీన్ చిట్ ఇచ్చిందన్నారు. ఇది పూర్తిగా రాజకీయ కక్షతో చేసిన కుట్ర అని స్పష్టం చేశారు. రాజకీయాల్లో నిబద్ధత ఉండాలని, ప్రజల కోసం, రాష్ట్రం కోసం చంద్రబాబు నాయుడు గారు నిత్యం ఆలోచించే నాయకుడని కొనియాడారు.

చంద్రబాబు వ్యక్తి కాదు – ఒక వ్యవస్థ

చంద్రబాబు నాయుడు గారు ఒక వ్యక్తి కాదని, ఒక వ్యవస్థ అని వ్యాఖ్యానించారు. ఆయనను అక్రమంగా అరెస్టు చేసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా 70 దేశాలు స్పందించాయంటే ఆయన స్థాయిని అర్థం చేసుకోవచ్చన్నారు. రాష్ట్రానికి ఒక తండ్రిలా చంద్రబాబు నాయుడు గారు మార్గనిర్దేశం చేస్తున్నారని తెలిపారు.

వైసీపీ దుర్భాషపై తీవ్ర విమర్శ

క్రీడా పోటీలు మహిళా క్రీడాకారిణుల్లో ఆత్మవి శ్వాసాన్ని పెంపొందిస్తాయి: మంత్రి మండిపల్లి

వైసీపీ నాయకుల దుర్భాష ప్రజలకు తీవ్ర అసహ్యం కలిగిస్తోందని విమర్శించారు. సీనియర్ నాయకులపై బూతులు మాట్లాడటం జుగుప్సాకరమని చెప్పారు. అంబటి వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యక్తిగత దూషణలు మానేసి అభివృద్ధిలో పోటీ పడాలని సూచించారు.

లడ్డూ కల్తీ నుంచి దృష్టి మళ్లించేందుకే కుట్రలు

తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంలో వైసీపీ దొరికిపోవడంతో దాన్ని దారి మళ్లించేందుకే ఇలాంటి నీచమైన ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆ ఉచ్చులో పడకుండా ప్రతి కార్యకర్త సంయమనం పాటించాలని, రాష్ట్రానికి నష్టం కలగకుండా బాధ్యతతో వ్యవహరించాలని కోరారు. తప్పు చేసిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పకుండా ఉంటాయని స్పష్టం చేశారు.

164 సీట్ల ప్రజాతీర్పు – బాధ్యత మరింత పెరిగింది

164 అసెంబ్లీ సీట్లు ఇచ్చి ప్రజలు చూపిన అపార ఆదరణకు కృతజ్ఞతలు తెలుపుతూ, అదే స్ఫూర్తితో రాష్ట్రాభివృద్ధి కోసం ముందుకు సాగుతామని పల్లా శ్రీనివాసరావు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *