బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

కేసీఆర్‌కు నోటీసులపై రేవంత్ రెడ్డి ఫైర్‌.. ‘జాతిపిత’ అన్న మాటతో చట్టానికి అతీతులా?

నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు జారీ చేయడాన్ని కొందరు ‘తెలంగాణ జాతిపిత’కు అవమానంగా చిత్రీకరించడంపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. చట్టం ముందు అందరూ సమానమేనని, వ్యక్తులకు ప్రత్యేక హోదాలు ఇచ్చి న్యాయ ప్రక్రియను అడ్డుకోవడం సరికాదని ఆయన స్పష్టం చేశారు.తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ప్రొఫెసర్ కోదండరామ్ కీలక పాత్ర పోషించారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఆర్‌ఎస్‌యూ నుంచి ఆర్‌ఎస్‌ఎస్ వరకు, కమ్యూనిస్టుల నుంచి కాంగ్రెస్ వరకు అన్ని వర్గాలను ఏకం చేసిన ఉద్యమ నాయకుడు కోదండరామ్ కాదా? అని ప్రశ్నించారు.కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, అదే ఉద్యమ నాయకుడైన కోదండరామ్ ఇంటి తలుపులు బద్దలు కొట్టించి పోలీసులు తీసుకెళ్లిన ఘటనను గుర్తు చేస్తూ, అప్పట్లో అది అవమానం అనిపించలేదా? అని రేవంత్ రెడ్డి నిలదీశారు. ఇప్పుడు కేసీఆర్‌కు నోటీసులు ఇస్తేనే ఉద్యమానికి అవమానం అన్న వాదన ఎంతవరకు సమంజసం? అని ప్రశ్నించారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు