Breaking News

ట్విస్ట్‌లతో టెన్షన్ పీక్స్..! ఓటీటీలో మస్ట్ వాచ్ 5 మలయాళ థ్రిల్లర్‌లు

నేటి తెలుగు పత్రిక ప్రతినిధి:

1. కిష్కింధ కాండం: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం జియో సినిమాస్‌లో అందుబాటులో ఉన్న ఈ సినిమా ఓ పవర్‌ఫుల్ థ్రిల్లర్. ప్రతి సీన్‌లో సస్పెన్స్ కొనసాగుతుంది. సైకలాజికల్ టెన్షన్‌ను క్రియేట్ చేయడంలో దర్శకుడు పూర్తిగా సక్సెస్ అయ్యాడు. ఉత్కంఠభరితమైన సీన్స్ ప్రేక్షకులను స్క్రీన్‌కు అతుక్కుపోయేలా చేస్తాయి.

2. డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్:

మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది ఓ ఇంట్రెస్టింగ్ మర్డర్ మిస్టరీ. కథనం నెమ్మదిగా బిల్డ్ అవుతూ చివర్లో అదిరిపోయే ట్విస్టులతో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది.

గీతవృత్తిలో ప్రమాదాలకు గురై గీత కార్మికులకు రావలసిన ఎక్స్ గ్రేషియాలకు నిధులు విడుదల చేయాలి.

3. ఎకో:

ఇది ఒక మిస్టరీ థ్రిల్లర్ సినిమా. కథ మొదలైనప్పటి నుంచి చివరి వరకు ఆసక్తి తగ్గకుండా సాగుతుంది. ఒక్కసారి ప్లే చేస్తే సినిమా పూర్తయ్యే వరకు ఆపలేరు. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.

4. జోసెఫ్:

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఓ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. కథ, నటన, ఎమోషనల్ డెప్త్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. థ్రిల్లర్ ఇష్టపడేవాళ్లకు ఇది కచ్చితంగా నచ్చే సినిమా.

క్రీడా పోటీలు మహిళా క్రీడాకారిణుల్లో ఆత్మవి శ్వాసాన్ని పెంపొందిస్తాయి: మంత్రి మండిపల్లి

5. అంజామ్ పాతిరా:

ఆహా మరియు సన్ నెక్ట్స్‌లో అందుబాటులో ఉన్న ఈ సినిమా ఓ రేస్ ఎగైనెస్ట్ టైమ్ క్రైమ్ థ్రిల్లర్. సీరియల్ కిల్లర్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ మూవీ టెన్షన్, ట్విస్టులతో ప్రేక్షకులను ఉత్కంఠలో ఉంచుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *