పులివెందుల ఫిబ్రవరి 3 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా దృష్టి అంతా చదువుపైనే పెట్టి భవిష్యత్తును బంగారు బాట వేసుకోవాలని పిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి తులసిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక జిల్లా పరిషత్ తలిశెట్టి సుబ్రహ్మణ్యం ప్రభుత్వ బాలుర, తలిశెట్టి శేషమ్మ బాలికల పాఠశాలల్లో 55వ వారోత్సవాన్ని వేరు వేరుగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాల్లో స్థల దాతలైన కుటుంబ సభ్యులకు పాఠశాల తరుపున ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి తులసిరెడ్డి మాట్లాడుతూ ప్రతి నిమిషం చాలా విలువైనదని కాబట్టి విలువైన సమయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నప్పుటికి తల్లిదండ్రుల తర్వాత గురువులకు కూడ గౌరవించడం అనేది మరవరాదని చెప్పారు.పండుగ వాతావరణంలో ప్రతి ఎడాది స్థల దాతలైన కుటుంబ సభ్యులతో రెండు పాఠశాలలో వార్షికోత్సవం జరుపుకోవడం చాల సంతోషకరమని చెప్పారు. బాలుర, బాలికల పాఠశాలలో చదివిన విద్యార్థులు ఎంతో ఉన్నత స్థాయిలో ఆయా రంగాల్లో ఉన్నారని వారిని నేటి విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. కష్టమైన ఇష్టంగా చదవి ట్రిపుల్ ఐటిలో సీటు సంపాదించాలని కోరారు. ప్రతి విద్యార్థికి లక్ష్యం అనేది ఉండాలని అ లక్ష్యం ఉంటే విజయం మన వైపు ఉంటుందని చెప్పారు.
అనంతరం ఎస్టీయు జిల్లా అధ్యక్షుడు నర్రెడ్డి సంగమేశ్వర రెడ్డి, యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి చెరుకూరు శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో విద్యార్థికి చదువు చెప్పే గురువులే భయపడుతున్నారని చెప్పారు.అరచేతిలో సెల్ ఫోన్ వచ్చిన తర్వాత పరిస్థితులు మారి పోయినట్లు చెప్పారు. గురువులను గౌరవిస్తే భవిష్యత్తు అంధకారం లేకుండా జీవితం అంతా సంతోషంగా ఉంటారని చెప్పారు. విద్యార్థులు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్న గురువులను గౌరవిస్తే భారత భావి పౌరులుగా ఎదిగేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. అవకాశాలను ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చదువుతో పాటు సంస్కారం ఉండాలని కోరారు.అన్ని రంగాల్లో బాలికల, బాలుర పాఠశాల విద్యార్థులు గుర్తింపు తెచ్చుకొంటున్నారని చెప్పారు. క్రమ శిక్షణ అనేది ప్రతి విద్యార్థికి ముఖ్యం అన్నారు. విద్యార్థులు భవిష్యత్తులో ఒక స్థాయిలో నిలబడాలని ఆకాంక్షించారు. ప్రతి ఎడాది విద్యార్థులు నగదు బహుమతిలు అందిస్తున్న దాతలను విద్యార్థులు మరిచి పోరాదని చెప్పారు. అనంతరం ట్రిపుల్ ఐటీలో సీట్లు సాధించిన, క్రీడాల్లో, చదువులో రాణించిన విద్యార్థులను నగదు బహుమతులను దాతలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ టీచర్ నరసింహరెడ్డి, పాఠశాల హెచ్ఎంలు శ్రీనువాసులు రెడ్డి, నాగాంజనేయులు, రాజశేఖర్, ధర్మారెడ్డి, స్థల దాత కుటుంబ సభ్యులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

