Breaking News

మొబైల్ మాయలో యువత

పులివెందుల ఫిబ్రవరి 3 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): ఆధునిక ప్రపంచంలో శాస్త్రసాంకేతిక రంగాలలో అనేక విప్లవాత్మకమైన మార్పులు ఆవిష్కృతమయ్యాయి. సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తూ యువతలో అల్లకల్లోలం సృష్టిస్తున్న వాటిలో సెల్ఫోన్ ప్రథమ స్థానంలో నిలిచింది. దీని మాయలోపడి పక్కన ఉన్నవారిని, చుట్టూ ఉన్న పరిసరాలను పట్టించు కోవడమే కరువైంది. ఈ మధ్య కాలంలో వీటి వినియోగం విపరీతంగా పెరిగి పోయింది. ఒక సర్వే ప్రకారం ప్రపంచ జనాభా 7 బిలియన్లయితే 5 బిలియన్ల మొబైల్ ఫోన్లు వాడకంలో ఉన్నాయని తేలింది. ఈ ఆధునిక ప్రపంచంలో ప్రతి ఒకరికి సెల్ఫోన్ అనేది ఒక అత్యవసర వస్తువుగా మారిపోయింది. ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తిని మొదలుకొని స్కూల్కి వెళ్ళే పిల్లవాడికి, కాలేజీకి వెళ్ళే యువతీయువకులకి, వృద్ధులకు సెల్ఫోన్ వినియోగం తప్పనిసరిగా మారింది. మంచి ఆలోచనలతో, ఒక గొప్ప ఆశయంతో కనుగొన్న మొబైల్ ఫోన్లను శాస్త్రవేత్తలు అందుబాటులోకి తీసుకువచ్చారు. కానీ నేటి తరం ఈ మొబైల్స్ మాయలో పడి సర్వం కోల్పోతున్నారు. గంటల కొద్దీ అనవసరమైన విషయాల గురించి, పనికిమాలిన అవసరాల గురించి సెర్చ్చేసి సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. అశ్లీల చిత్రాల ప్రభావంలో చాలా మంది కొట్టుకుపోతున్నారు. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ మొదలైన వాటిలో విద్వేష పూరితమైన, అసందర్భమైన విషయాలను అనేకరకాలుగా పోస్టులు పెడుతూ వికృతానందాన్ని పొందుతున్నారు.

ఘనంగా సీనియర్ జర్నలిస్ట్ సత్య జన్మదిన వేడుకలు

కొంతమంది ఎదుటి వాళ్ల మనోభావాలను విలువలను గాలికి వదిలేసి స్టేటస్లను, ఫోటోలు, విడియోలు అప్లోడ్ చేస్తూ రాక్షసానందం పొందుతున్నారు. వ్యక్తిగతమైన, ఉన్నతమైన, విజ్ఞానపరమైన చరిత్రలను, తెలియని ఎన్నో మంచి విషయాలను తెలుసుకోవడానికి వినియోగించుకోవాల్సిన మొబైలు, వాటి సాంకేతికతను ఎందుకు పనికిరాని విషయాలకు వాడుతూ ఒక ఉన్మాదపూరిత వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. వ్యక్తిగతంగా అల్లరిపాలు అవుతూ, ఆర్థికంగా నష్టపోతూ, మానసిక ఆవేదనకు గురి అవుతూ ఆత్మహత్య చేసుకున్న వారూ లేక పోలేదు. అంతేకాకుండా అధిక సమయం మొబైల్ వాడకం వల్ల దానినుండి వెలువడే రేడియేషన్లో అనారోగ్య సమస్యలు వ్యాపిస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మితిమీరిన పోకడలతో, ఎక్కువ సమయం మొబైల్ ఫోన్లు వినియోగించకుండా ఎవరికి వారు నియంత్రణ పాటిస్తూ ఉన్నతమైన విలువలతో కూడిన వ్యక్తిత్వాన్ని అలవర్చుకోవాలి. సెల్ఫోన్ ఉచ్చులోపడి బంగారు భవిష్యత్తును కోల్పోవద్దు. సమాజానికి భారంగా మారవద్దు. నేటి యువత మొబైల్ కు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఎల్‌పీజీ కొరతపై కేంద్రానికి రాష్ట్ర విజ్ఞప్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *