బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

చంద్రబాబు ఆదేశాలను పాటిస్తాం

టిడిపి అధ్యక్షుడు పల్లా సూచనల మేరకే నడుచుకుంటాం.

ప్రత్యర్థులు కవ్వింపు చర్యలకు పాల్పడిన సమన్వయంతో వ్యవహరిస్తాం.

సమయం సందర్భం వస్తే తగిన బుద్ధి చెబుతాంటిడిపి సీనియర్ నేత వెంకట్రామిరెడ్డి.

పులివెందుల ఫిబ్రవరి 3 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): మా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలను తప్పకుండా పాటిస్తాం. అలాగే మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సూచనల మేరకే నడుచుకుంటాం.. ప్రత్యర్థులు కవ్యంపు చర్యలకు పాల్పడిన సంయమనంతో వ్యవహరిస్తాం.. అప్పటికి ప్రత్యర్థులలో మార్పు రాకుంటే సమయం సందర్భం చూసుకొని తగిన బుద్ధి చెబుతామని టిడిపి సీనియర్ నేత మద్దూరు వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. పులివెందులలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాజకీయపరంగా అటు కమ్మ ఇటు రెడ్ల సామాజిక వర్గాల మధ్య ఎక్కువగా ఆదిపత్య పోరు ఉంటుందన్నారు. అలాగే అటు టిడిపి ఇటు వైసిపి లో కమ్మ, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఎంతో సమన్వయంతో పెద్దరికంతో వ్యవహరిస్తున్నారని తెలిపారు. కానీ కాపు వర్గానికి చెందిన మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని వీరికి తోడు గౌడ సామాజిక వర్గానికి చెందిన జోగి రమేష్ ఈ ముగ్గురు కలిసి ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కుట్రలు పన్నారన్నారు. 2024 ఎన్నికలలో 11 సీట్లు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినా కూడా వారిలో ఏమాత్రం సిగ్గు రాలేదన్నారు.

కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక ఎలాగైనా మైలేజీ సంపాదించుకోవాలన్న దురుద్దేశంతో ఆ ముగ్గురు అంబటి, పేర్ని, జోగి మాజీ ఎమ్మెల్యేలు కలిసి కులాల మధ్య కుంపట్లు రాజేసేందుకు సిద్ధమయ్యారన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యే గల్లా మాధవిని ఉద్దేశించి అంబటి కుమార్తె చంద్రబాబు ఉచ్చులో పడొద్దు అంటూ సూచన చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నట్లు అన్న చందంగా ముందుగా ఆమె తండ్రి అంబటికి మంచి బుద్ధి తెచ్చుకోమని హితబోధ చేస్తే బాగుంటుందన్నారు. పల్లా శ్రీనివాసరావు కూడా మన పరిపాలనకు ఇంకా మూడేళ్లు వ్యవది ఉందని ఇంకా ఎంతో అభివృద్ధి చేయాల్సి ఉందని తమ పార్టీ నాయకులు అందరికీ సందేశాలు పంపారన్నారు. ఎలాగైనా ప్రభుత్వాన్ని బ్రష్టు పట్టించాలన్న దుర్దేశంతో ప్రత్యక్ష పార్టీల ఎమ్మెల్యేలు చెప్పే మాటలు నమ్మొద్దు అంటూ సందేశం పంపారన్నారు. అందుకే తాము కూడా పల్లా శ్రీనివాసరావు సూచనల మేరకు సంయమనం పాటిస్తున్నామని తెలిపారు. ఇక మీదట కూడా ప్రత్యర్థులు తమపై అవాకులు చవాకులు పేలితే సమయము సందర్భం చూసుకుని తాము కూడా తమదైన శైలిలో స్పందిస్తామని వెల్లడించారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు