బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

కోదాడలో కాంగ్రెస్ నాయకుల అరాచక పర్వాలు

హిందూ మహిళకు ముస్లిం సాంప్రదాయ బురఖా వేసి నామినేషన్ ఉపసంహరించుకుంటుంటే పట్టించుకొని ఎన్నికల అధికారులు.

కోదాడ, ఫిబ్రవరి 3(నేటి తెలుగు పత్రిక): కోదాడ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల వ్యవహార శైలి తీవ్ర వివాదానికి దారితీస్తోంది. భారతదేశం కులాలు, మతాలు అన్నిటికీ గౌరవం ఇస్తూ ఐక్యతతో ముందుకు సాగే దేశమని ప్రజలు విశ్వసిస్తుంటే, కోదాడలో మాత్రం ఎన్నికల్లో గెలుపు సాధించలేమనే భయంతో కాంగ్రెస్ నాయకులు అనైతిక చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

11వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేసిన ఒక అభ్యర్థిని భయబ్రాంతులకు గురిచేసి కిడ్నాప్ చేయడమే కాకుండా మరోక హిందూ మహిళా అభ్యర్థిని ప్రలోభాలకు గురి చేసి, ఆమె చేత నామినేషన్ ఉపసంహరణ చేయించేందుకు మతపరమైన గుర్తింపులను దుర్వినియోగం చేశారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ముస్లింల సంప్రదాయంగా భావించే బురఖాను ఆ మహిళకు వేయించి, పోలీస్ ఎన్నికల అధికారులను అడ్డంపెట్టుకుని నామినేషన్ ఉపసంహరణకు ప్రయత్నించడం తీవ్ర విమర్శలకు దారితీసింది.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు

ఈ ఘటనను చూసిన కోదాడ ప్రజలు “అధికారం కోసం ఇలాంటి దిగజారిన రాజకీయాలు అవసరమా?” అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.దళిత–బహుజనులు అధికంగా నివసించే ఈ వార్డులో, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరఫున స్వయంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు రంగంలోకి దిగి ఇలాంటి చర్యలకు ప్రోత్సహించారనే ఆరోపణలు మరింత కలకలం రేపుతున్నాయి.ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు గట్టి దెబ్బ అని, ఎన్నికల స్వేచ్ఛను కాలరాసే చర్యలుగా ఈ వ్యవహారాన్ని ప్రజలు అభివర్ణిస్తున్నారు.