విజయవాడ,ఫిబ్రవరి 3, నేటి తెలుగు పత్రిక : ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మార్చి 13, 14, 15 తేదీల్లో విజయవాడలోని ఎస్.ఎస్. కన్వెన్షన్‌లో భారీ ఎ.పి .ఎంఎస్ఎంఈ ఎక్స్‌పో నిర్వహింస్తున్నామని ఎపి ఎంఎస్ఎంఇ గౌరవ అధ్యక్షులు బాయిన వెంకట్రావు తెలిపారు. సోమవారం ఆటోనగర్ లోని ఎపిఎస్ఎంఇ ఐ.ఎ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతు ఈ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. చిన్న పరిశ్రమల నిర్వాహకులు తయారు చేసే ఉత్పత్తులకు మంచి మార్కెటింగ్ అవకాశాలు కల్పించడం ఈఎక్స్ పో ఉద్దేశమని అన్నారు. ఈ ఎక్స్‌పోలో స్టాల్స్ ఏర్పాటు చేసుకునే వారికి ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ నుండి అద్దె రీయింబర్స్‌మెంట్ మరియు జిఎస్‌టి రీయింబర్స్‌మెంట్ సౌకర్యం ఉంటుంది. దీనివల్ల నిర్వాహకులపై ఎటువంటి ఆర్థిక భారం పడదని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ఎంఎస్ఎంఈలకు కల్పించిన ఉపాధి కల్పన పథకాలు, ఇతర ప్రోత్సాహకాలపై ఈ ఎక్స్‌పోలో అవగాహన కల్పిస్తామని ఈ ఆవకాశాన్ని విధ్యార్థులు ఉపాయేగించుకోవాలని కోరారు.వ్యాపార అభివృద్ధి కి బిడిఎల్, కోల్ ఇండియా, ఓఎన్‌జిసి, రైల్వే వంటి ప్రభుత్వ రంగ సంస్థలతో ఎంఎస్ఎంఈలను అనుసంధానం చేస్తున్నామని అన్నారు.విజయవాడలోని సుమారు ఒక లక్ష మందికి పైగా ఇంజనీరింగ్ విద్యార్థులు ఈ ఎక్స్‌పోను సందర్శించాలని కోరారు. తద్వారా భవిష్యత్తులో సొంతంగా పరిశ్రమలు స్థాపించాలనుకునే వారికి ఇదొక చక్కని వేదిక అవుతుందని తెలిపారు.మహిళా పారిశ్రామికవేత్తలకు ఉన్న అవకాశాలను వివరించడానికి విజయవాడ సిటీ, పామర్రు, కొండపల్లి వంటి ప్రాంతాల్లో ఎంఎస్ఎంఈ పార్కులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలిపారు.
ఈ ఎక్స్‌పో ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ రంగానికి ఒక కొత్త దిశను చూపిస్తుందని, పారిశ్రామికవేత్తలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం ఎపిఎంఎస్ఎంఇ అధ్యక్షులు డి.దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ఎపి. ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మార్చి 13, 14, 15 తేదీల్లో విజయవాడలోని ఎస్.ఎస్. కన్వెన్షన్‌లో ఎంఎస్ఎంఈ ఎక్స్‌పో నిర్వహించనున్నారు. ఈఎపి.ఎం.ఎస్.ఎం.ఇ ఎక్స్‌పో చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి ఒక చక్కని వేదిక కానుందని పేర్కొన్నారు.
అనంతరం ఎపిఎంఎస్ఎంఇ ఐఎ ప్రధాన కార్యదర్శి రామ చంద్ర రావు మాట్లాడుతూ గత డెబ్బై సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమల అభివృద్ధి కి పాటుపడుతుందన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంఎస్ఎంఇలకు ఎన్నడు లేనంతగా ప్రొత్సాహకాలు అందిస్తున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి నార చంద్రబాబు నాయుడు ఇంటికో పారిశ్రామిక వేత తయారు చేయలనే లక్ష్యంతో ఉన్నారని అన్నారు. ఇటువంటి అవకాశాలను యువత ముఖ్యంగా మహిళలు అందిపుచ్చుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో ఎపి ఎంఎస్ఎంఇ ఐఎ కోశాధికారి జె.వి.ఎస్.ఆర్.కె.ప్రసాద్,విజయవాడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అసోసియేషన్ కార్యదర్శి టి.వి.నాగేశ్వరరావు, జె.ఆర్.డి.టాటా ఐలా సర్వీస్ సోసైటి ఛైర్మన్ టి.వినోద్ బాబు,కార్యదర్శి టి.శ్రీనివాసరావు,జి.సాంబశివరావు, ఎ.నరసింహ రావు,ఎన్.వి.రవి కుమార్,వి. రమేష్ బాబు, ఐలాఎక్స్ ఛైర్మన్ దుర్గా ప్రసాద్ ఇతర పారిశ్రామిక వేతలు పాల్గొన్నారు.

