వార్షిక లక్ష్యాన్ని పెంచిన కేంద్రం: రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ వెల్లడి.
తెనాలిలో కంటి అద్దాల పంపిణీని ప్రారంభించిన మంత్రులు సత్యకుమార్, నాదెండ్ల మనోహర్.
తెనాలి, పిబ్రవరి03 (నేటి తెలుగు దిన పత్రిక ప్రతినిధి): విద్యార్థులకు కంటి పరీక్షల నిర్వహణలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం పొరుగు రాష్ట్రాల వారికి ఆదర్శంగా ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత కళ్లజోళ్ల పంపిణీ ప్రారంభ రాష్ట్ర కార్యక్రమం మంగళవారం జరిగింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, కంటి అద్దాలను అందచేశారు. దీనినకి అనుగుణంగా ఇతర జిల్లాలోని విద్యార్థులకు కంటి అద్దాలు పంపిణీ ప్రారంభమైంది.
ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడారు. “జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమం కింద కిందటేడాది నిర్దిష్ట ప్రమాణాలు అనుసరించి రాష్ట్రంలో ఎంపికచేసిన పాఠశాలల్లో పరీక్షలు జరిపి 94,689 మందికి కంటిచూపులో ఉన్న లోపాల కారణంగా కళ్లజోళ్లు అవసరమని తేలింది. పారా మెడికల్ ఆఫాల్మిక్ ఆఫీసర్స్/పారా మెడికల్ ఆఫాల్మిక్ అసిస్టెంట్సు ద్వారా పరీక్షలు జరిగాయి. 6/12 కంటే తక్కువ కంటి చూపు ఉన్న వారిలో 90,000 మందికి కంటి అద్దాలను ఇవ్వాలని కేంద్రం రాష్ట్రానికి లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే అదనంగా ఆరు శాతం విద్యార్థులకు కంటి అద్దాలు వైద్య ఆరోగ్యశాఖ అందజేస్తుంది. పాఠశాల విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు, కళ్లజోళ్ల పంపిణీలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అనుసరిస్తున్న ఉత్తమ విధానాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. 2024-25లో లక్ష్యం 90వేల మందికి కంటి అద్దాలు ఇవ్వాలన్న లక్ష్యం ఉన్నా 1,89,102 మందికి ఇచ్చారు. 2025-26 లో ఇప్పటికే 94,689 మందికి కంటి అద్దాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు జరిగాయి. లక్ష్యానికి మించి విద్యార్థులకు కంటి అద్దాల పంపిణీ ఇవ్వడానికి సేవా సంస్థలు ముందుకు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ చొరవ కారణంగా సేవా సంసల నుంచి స్పందన బాగా కనిపిస్తోంది. వార్షిక లక్ష్యాలను సాధించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూపుతున్న చొరవ పొరుగు రాష్ట్రాలకు స్ఫూర్తిగా ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ (జాతీయ అంధత్వ నివారణ సంస్ర) కొనియాడింది అంతేకాకుండా వార్షిక లక్ష్యం కింద నిర్దేశించిన 90వేల కంటి అద్దాల పంపిణీని 2026-27లో 2.50 లక్షలకు పెంచింది. దీనివల్ల రూ.7.70 కోట్ల వరకు ఖర్చు అవుతుంది” అని మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ వివరించారు. ఆర్బీఎస్ కే ద్వారా విద్యార్థుల ఆరోగ్యానికి భరోసా కలిపిస్తున్నామని తెలిపారు విద్యార్థుల్లో ఉన్న రక్తహీనత సమస్య పరిష్కరించేందుకు ప్రాథమిక దశలోనే వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. బాలికలకు శానిటరీ న్యాప్కిన్స్ పంపిణీ, ఇతర ఆరోగ్య కార్యక్రమాలు చేబడతున్నామన్నారు. మంత్రి నాదెండ్ల విజ్ఞప్తి మేరకు తెనాలి లో వంద పడకలతో క్రిటికల్ కేర్ బ్లాక్ ఏర్పాటుకు, రూ.25 లక్షలతో ఆయుష్ ఇంటిగ్రేటెడ్ ఆసుపత్రిని మంజూరు చేసినట్లు తెలిపారు. టిఫా స్కాన్ సెంటరును కూడా ఏర్పాటుచేశామన్నారు.క్యాన్సర్ కేసుల నియంత్రణకు అందరూ సహకరించాలని మంత్రి శ్రీ సత్య కుమార్ విజ్ఞప్తి చేశారు. 6వ శాతం కేసులను ముందస్తు జాగ్రత్తలతోనే నియంత్రిచొని తెలిపారు
సత్యకుమార్ ను ప్రశంసించిన మంత్రి నాదెండ్ల
రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు చిన్న వయసులోనే కంటి చూపులోని లోపాలు గుర్తించి కళ్లజోళ్ల పంపిణీ చేయడం ద్వారా మంచి ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో ఉంటూ జాతీయ స్థాయిలో గుర్తింపు కలిగిన మంత్రి సత్యకుమార్ యాదవ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో మంచి సంస్కరణలు తెస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్, జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ కంటి అద్దాల్లో సమస్యలు ఉంటే విద్యార్థుల ఉపాధ్యాయులకు తెలియచేయాలని కోరారు.


