విజయవాడ, పశ్చిమ ఫిబ్రవరి 3 నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: దేవదేవుడి ప్రసాదాన్ని కించపరిచిన వారి పై క్రిమినల్ కేసులు కట్టాలి. కలియుగ దైవం వెంకటేశ్వ ర స్వామిని అవమానించి న వ్యక్తి చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ లు హిందు వుల ద్రోహులు – వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఇసుక, రేషన్, మద్యం, మట్టి దోపిడీ చేసే వ్యక్తి కేశినేని చిన్ని. తిరుపతి ప్రసాదాన్ని కించపరిచే విధంగా, అవమానించే విధంగా పదే పదే మాట్లా డుతున్నా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లపై కేసులు కట్టా లని కోరుతూ రాష్ట్రా వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మాజీ దేవాదాయ శాఖ మంత్రి పశ్చిమ నియోజకవర్గం వైకాపా ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు 2 టౌన్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ చిన్నకొండలరావుకి మంగళవారం నాడు నియో జకవర్గ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఫిర్యా దు చేశారు. ఈ సందర్బం గా వెలంపల్లి మాట్లాడుతూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం తరపున ఏదైతే పవిత్రమైన ఆ దేవదేవుడి ప్రసాదం లడ్డు లో పందికొవ్వు, యానిమ ల్ ఫ్యాట్, చేప నూనె కలి సింది అని చెప్పి పదే పదే, సుమారుగా ఒక సంవత్సర కాలం నుంచి, గత సంవత్స రం సెప్టెంబర్ 18వ తారీకు నుంచి ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయు డు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ముగ్గురు కూడా తిరుపతి ప్రసాదాన్ని కించ పరిచే విధంగా, అవమానిం చే విధంగా పదే పదే మాట్లాడుతున్నారన్నారు. వారిపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశామన్నారు. మొన్న సిట్ నివేదికలో ఏదైతే నేషనల్ ల్యాబ్స్ నుంచి ఒకటి హర్యానా నుంచి, ఒకటి గుజరాత్ నుంచి – రెండు ల్యాబ్స్ నుంచి కూడా రిపోర్ట్ వచ్చింది. దాంట్లో ఎక్కడా కూడా యానిమల్ ఫ్యాట్ లేదు అనేది ధ్రువీకరించా రన్నారు. అయినా గానీ ఈ కూటమి ప్రభుత్వం వెంకటే శ్వర స్వామి మీద భక్తి ఉంటే ఈ పనులు చేయరు వాళ్ళు అని తెలిపారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చాకే ఆ నెయ్యి శాంపిల్ తీయడం జరిగిందన్నారు. ఈ ప్రభు త్వం వచ్చాకే ఆ నెయ్యి ట్యాంకర్ రావడం, ఈ ప్రభుత్వం వచ్చాకే ఆ ట్యాంకులు పంపించడం, ఈ ప్రభుత్వం వచ్చాకే అంటే ఈ కూటమి ప్రభు త్వం వచ్చాకే మళ్ళీ వాటిని వాడారని కూడా నివేదికలో పొందుపరచడం జరిగిందన్నారు. ఒకవేళ గనుక ఇందులో మీరు అనుకున్న విధంగా కల్తీ ఉంటే ఆ తప్పు ఈ కూట మి ప్రభుత్వానిదే అని అన్నారు. దేవదేవుడికి అపచారం చేసింది కూట మి ప్రభుత్వమే దుయ్య బట్టరు. ఇదంతా కూడా ప్రజలు గమనించాలని కోరారు. గత మూడు రోజుల నుంచి చెప్తున్నాను, ఇది తప్పు, ఎక్కడా కూడా యానిమల్ ఫ్యాట్ కలవలేదని అన్ని ల్యాబ్ రిపోర్ట్స్ ఇచ్చాయి అని చెప్పి అయినా కానీ చంద్రబాబు నాయుడు, అతను చేసేది తప్పని తెలుసు, దేవుణ్ణి అవమానిస్తున్నాడని తెలుసు, అయినా కానీ పదే పదే దీని మీద మాట్లాడుతూ ప్రజలు ఏదైతే ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ప్రజలంద రికీ కూడా నిజం తెలిసింద న్నారు. కానీ అత ను చెప్పిన అబద్ధాన్ని నిజం చేయాలనే ఒక దుష్సంక ల్పంతో రోడ్డు మీద బ్యాన ర్లు ఏర్పాటు చేస్తున్నార న్నారు. మొన్న నిన్న చెప్తు న్నట్టు వెంకటేశ్వర స్వామి ని రోడ్డు మీదకు లాగుతు న్నారన్నారు. అని చెప్పి రోడ్డు మీద బ్యానర్లు కట్టింది ఎవరండి? రోడ్డు మీద బ్యానర్లు కట్టింది కూటమి ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. మరి వెంకటేశ్వర స్వామికి అంత అపరాధం చేస్తుంది ఎవరూ? చంద్రబాబు నాయుడు కాదా? అని అన్నారు. వెంకటేశ్వర స్వామిని ప్రపంచ వ్యాప్తం గా కూడా అవమానించిన వ్యక్తి, కించపరిచిన వ్యక్తి, అన్ని విధాలా కూడా అప చారాలు చేస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడే అని దుయ్యబట్టరు. విజయవా డ పార్లమెంట్లో ఇంత దద్దమ్మ ఎంపీని ఎప్పుడు చూడలేదు మన విజయ వాడ ఎంపీ సూట్ వేసుకొని ఢిల్లీలో మాట్లాడుతున్నాడు. సూట్ వేసుకున్నంత మాత్రాన అతను సూట్ వేసుకున్న మనిషి కాదన్నారు.
ఎంపీ మన కేశినేని చిన్ని, నాకు తెలిసి విజయ వాడ పార్లమెంట్లో ఇంత దద్దమ్మ ఎంపీని ఎక్కడా చూడలేద న్నారు. మనం ఎక్కడా కూడా ఇంత దద్దమ్మ ఎంపీ ని చూడ లేదు ఎందుకంటే ప్రతి దాంట్లో దోపిడీయే. గతంలో మన విజయవాడ పార్ల మెంటుకి మంచి మంచి ఎంపీలు చేశారు. వీళ్ళ అన్నయ్య కూడా బాగా చేశాడన్నారు. పదేళ్ళు వాళ్ళ అన్నయ్య తెలుగు దేశం పార్టీ ఎంపీ అయినా కానీ ఎక్కడా కూడా అవినీ తి గానీ, ఇటువంటి ఇసుక దోపిడీ గానీ, భూ కబ్జాలు గానీ, ఇటువంటి రౌడీజం గానీ ఎప్పుడూ చేయలేదన్నారు. ఈ ఎంపీ వచ్చాక ఎన్టీఆర్ జిల్లాను భ్రష్టు పట్టించాడన్నారు. చిన్ని మాట్లాడుతాడు నిన్న జోగి రమేష్ మీద దాడి జరిగితే, వాళ్ళ పార్టీ వాళ్లే కావాలని చేయించుకున్నారు. అని చెప్పి అన్నారు. మరి ఆ 40 మంది తెలుగుదేశం పార్టీ మీద ఏదో చిన్న కేసు పెద్ద కేసు, ఒక కేసైతే పెట్టారు కదా ఇబ్రహీంపట్నంలో, ఎందుకు పెట్టారు కేసు? వాళ్లకు స్టేషన్ బెయిల్ ఇచ్చేసి రాజమర్యాదలతో కూర్చో బెట్టారు. వాళ్లు మీ పార్టీ వాళ్ళు కాదా అని ప్రశ్నించారు. వాళ్ళందరికీ చక్కగా కాఫీలు, టీలు ఇచ్చి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. అదే మా పార్టీ వాళ్ళు చేసి ఉంటే మరి మీ తెలుగుదేశం వాళ్ళ మీద కొంతమంది మీదైనా సరే చిన్న చిన్న కేసులు ఎందుకు పెట్టావయ్యా కేశినేని చిన్ని? అని ప్రశ్నించారు. నీ యొక్క అవినీతి గురించి మేము చెప్పాల్సిన పనిలేదు. మీ తిరువూరు ఎమ్మెల్యే చెప్పాడు ఇసుక దోపిడీ, రేషన్ దోపిడీ, మద్యం దోపిడీ, మట్టి దోపిడీ, ఈ ఎన్టీఆర్ జిల్లాలో వనరుల న్నీ కూడా దోచుకుంటున్న వాడు ఎవడన్నా అంటే కేశినేని చిన్ని అన్నమాట అని ఎద్దేవా చేసారూ. ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న వనరులన్నీ కూడా దోచుకు న్న వ్యక్తి కేశినేని చిన్నినే దాంట్లో ఎటువంటి డౌట్ లేదన్నారు.

