విజయవాడ. సెంట్రల్ ఫిబ్రవరి 3 నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం ఏదైనా 112 లేదా 1972కు తెలియజే యాలి. సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావు. డ్రోన్లు, 12,000 సీసీ కెమెరాలు, న్యాట్‌గ్రిడ్ డేటాబేస్ ద్వారా నగరంపై ఉక్కుపాదం. మంగళవారం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని సత్యనారాయణపురం బి ఆర్ టి ఎస్ రోడ్డులో, శారదా కళాశాల జంక్షన్ వద్ద “డ్రగ్స్ వద్దు ఆరోగ్య మైన సమాజం కావాలి” అనే నినాదంతో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 510 కిలోమీటర్ల డ్రగ్స్ వ్యతిరేక సైకిల్ యాత్ర ఎనిమిదవ రోజు అత్యంత ఘనంగా ప్రారంభమైంది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్, సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావు పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి సైకిల్ యాత్రలో పాల్గొని, ప్రజల్లో డ్రగ్స్‌పై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా బొండా ఉమామహేశ్వర రావు మాట్లాడుతూ గత ప్రభు త్వాల పరిపాలనలో రాష్ట్రంలో పరిస్థితి అత్యం త దారుణంగా ఉండేదని, ఏ రోడ్డుపై వెళ్లినా, ఏ మహిళా కేంద్రానికి వెళ్లినా గంజాయి ప్రభావం స్పష్టం గా కనిపించేదని, నేషనల్ ప్రైమ్ బ్యూరో రికార్డుల ప్రకారం 2019–2024 మధ్యకాలంలో భారత దేశంలో గంజాయి వినియోగం అత్యధికంగా ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని, దీని కారణం గా రాష్ట్రం దేశవ్యాప్తంగా క్రైమ్ రికార్డుల్లోకి వెళ్లిన పరిస్థితి ఏర్పడిందని. అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృఢ సంకల్పం, స్పష్టమైన ఆదేశాలు, అలాగే సమర్థవంతమైన పోలీస్ యంత్రాంగం, నిబద్ధత కలిగిన అధికారుల కృషితో నేడు పరిస్థితి పూర్తిగా మారిందని, గంజాయి నియంత్రణపై తీసుకు న్న కఠిన చర్యల వల్ల రాష్ట్రంలో క్రైమ్ రేటు దాదాపు 70 శాతం వరకు తగ్గడం ఒక చారిత్రాత్మక విజయం అని, గతంలో గంజాయి మత్తులో ఉన్న యువత తల్లి–చెల్లి–పెద్దల తేడా కూడా తెలియని స్థితికి వెళ్లేదని, కుటుంబ వ్యవస్థ, సమాజ భద్రత తీవ్రంగా దెబ్బతిన్నదని అలాంటి దుర్భర పరిస్థి తులను నేడు పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చా మని, ఇది ప్రజలందరూ గర్వపడాల్సిన విషయం అని, విజయవాడ నగరం లో కమిషనర్ రాజశేఖర్ బాబు బాధ్యతలు చేపట్టి న తర్వాత డ్రోన్లు, 12,000 సీసీ కెమెరాల నిఘాతో, పాత ఇళ్లు, పాడుబడ్డ పార్కులు, మారుమూల ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహించిన గంజాయి బ్యాచ్‌లు, బ్లేడ్ బ్యాచ్‌లను పూర్తిగా అణిచివేసినట్లు డ్రగ్స్‌కు బానిసలైన వారిలో చాలా మందిని సరైన మార్గంలోకి తీసుకురావా లనే ఉద్దేశంతో వేల సంఖ్యలో రిహ్యాబిలిటేషన్ సెంట ర్లకు పంపించామని, శిక్షతో పాటు సంస్కరణ కూడా ప్రభుత్వ లక్ష్యమని, గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఏర్పడిన లోపాలు, సమస్యలను ఈ 20 నెలల ఎన్డీఏ పరిపాలనలో గణనీయంగా నియంత్రించ గలిగినందుకు సంతోషంగా ఉందని. నేడు మహిళా పోలీస్ అధికారులతో కలిసి 500 కిలోమీటర్లకు పైగా సైకిల్ యాత్ర నిర్వ హిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారని, ఈ ఉద్యమంలో పోలీస్ సిబ్బంది, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేటర్లు, మంత్రులు అందరూ ప్రజల మధ్యే ఉండి బాధ్యతగా పాల్గొంటున్నారని, గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్య మని, అధికారులు ప్రజాప్ర తినిధులు–ప్రజలు అంద రం కలిసి ఈ పోరాటాన్ని విజయవంతం చేస్తామని అన్నారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజ శేఖర్ బాబు మాట్లాడుతూ ఈ డ్రగ్స్ వ్యతిరేక సైకిల్ యాత్ర 34 రోజుల పాటు కొనసాగుతుందని, ఐదు మంది మహిళా పోలీస్ అధికారులు సైకిళ్లపై ప్రయాణిస్తూ 510 కిలో మీటర్ల మేర ఎన్టీఆర్ జిల్లా అంతటా తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని, ఈ కార్యక్ర మంలో భాగంగా మొత్తం 29 ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించా మని, పోలీస్ శాఖగా డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా మని, ప్రత్యేకంగా 2018 నుంచి నేటి వరకు డ్రగ్స్ నియంత్రణ చర్యలు మరింత కఠినంగా కొనసాగుతున్నాయని,ఈ కాలంలో 2,515 మందిని డ్రగ్స్ కేసుల్లో అరెస్ట్ చేయడం జరిగిందని, డ్రగ్స్‌కు బానిసలైన వారిని విడుదల చేసిన తర్వాత మళ్లీ ఆ దారిలోకి వెళ్లకుండా నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యం లో ఉన్న సెంట్రల్ గవర్న మెంట్ జనరల్ హాస్పిట ల్‌కు పంపించి దాదాపు 200 మందికి కౌన్సెలింగ్, అవసరమైన మెడికేషన్ అందించామని. ఇది కేవలం పోలీస్ కార్యక్రమం మాత్రమే కాకుండా భారీ స్థాయి సామాజిక బాధ్యత ఉద్యమం అని, నగరంలో ని అన్ని హాట్‌స్పాట్లలో కార్డ్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు, సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా నిఘా పెంచినట్లు, ఈ ఉద్యమంలో ఆటో డ్రైవర్స్ అసోసియేషన్, ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్స్ అసోసి యేషన్, ఎన్జీవోలు, బ్యాంక్ ఉద్యోగులు, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, విద్యార్థులు అన్ని వర్గాలను భాగస్వా ములుగా చేస్తున్నామని,ఎన్టీఆర్ పోలీస్ కమిషనరే ట్ పరిధిలో గత ఏడాదిన్నర కాలంలో డ్రగ్స్ అక్రమ రవాణా, వినియోగంలో కీలక పాత్ర పోషిం చిన 23 మందిపై పీడీ యాక్ట్ ప్రయోగించి ఏడాది పాటు జైలుకు పంపామని, డ్రగ్స్ విషయంలో ఏ పరిస్థితు ల్లోనూ ఉపేక్ష ఉండదని, దేశాభివృద్ధి, రాష్ట్రాభివృ ద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమని, అందుకే యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడు కోవడం మన అందరి బాధ్యత అని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామ హేశ్వరరావు పోలీస్ శాఖకు ఎప్పటి కప్పుడు అందిస్తున్న సహకారం వల్లే, ఈ నియో జకవర్గంలో అవాంఛనీయ సంఘటన లు తగ్గించగలుగుతున్నా మని కమిషనర్ ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ ర్యాలీ లో అడ్మిన్ డీసీపీ, ఎస్ పి లు, ఇతర ఉన్నతాధికారు లు, రిటైర్డ్ పోలీస్ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు సహా సుమారు 3,000 మంది పాల్గొని ర్యాలీని విజయవంతంగా నిర్వహించారు.

