బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి

28వ వార్డులో బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు .

పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్.

కోదాడ,ఫిబ్రవరి 4 (నేటి తెలుగు పత్రిక): గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో కోట్ల రూపాయల నిధులతో కోదాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని, ఆ అభివృద్ధిని చూసి రానున్న కోదాడ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులను ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కోరారు.కోదాడ పట్టణ పరిధిలోని 28 వ వార్డులో వివిధ పార్టీలకు చెందిన సుమారు 30 మంది ఆ పార్టీలకు రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీ లో చేరారు.వారికి మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచిన రెండేళ్లుగా కోదాడ పట్టణoలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, అభివృద్ధి పూర్తిగా స్థంభించిపోయిందని విమర్శించారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు

గతంలో బీఆర్ఎస్ పార్టీ పాలనలో పట్టణ ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వ8 ఆసుపత్రిని 30 పడకల నుంచి 100 పడకలకు పెంచడం, రూ.100 కోట్ల వ్యయంతో డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడం, వందల కోట్ల రూపాయలతో మట్టి రోడ్లను సీసీ రోడ్లుగా మార్చడం, పట్టణానికి వెలుగులు తీసుకువచ్చేలా సెంట్రల్ లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయడం, మినీ ట్యాంక్‌బండ్‌ను అభివృద్ధి చేయడం వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఘనత బీఆర్ఎస్ పార్టీదేనని తెలిపారు.

అలాగే, దాదాపు పది వార్డులలో ఇళ్ల మీదుగా వెళ్లే 33/11 కేవీ విద్యుత్ వైర్ల కారణంగా ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, అనేక మంది ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఆ సమస్యను గుర్తించి అధికారులతో మాట్లాడి విద్యుత్ వైర్లను తొలగించి ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపించామని చెప్పారు.కోదాడ మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయిన తర్వాత కూడా గ్రామ పంచాయతీ సిబ్బందినే కొనసాగిస్తుండగా, పట్టణ జనాభాకు అనుగుణంగా పారిశుద్ధ్య సిబ్బందిని నియమించి పరిశుభ్రతను కాపాడామని తెలిపారు. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పారిశుద్ధ్య సిబ్బందిని తొలగించి వారిని ఇబ్బందులకు గురిచేయడమే కాకుండా పట్టణాన్ని మురికి కూపంగా మార్చి దోమల బెడదతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడేలా చేస్తూన్నారని ఆరోపించారు.కోదాడ పట్టణ అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉందని, బీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.