Breaking News

700 మంది సాధువుల గర్జన సదస్సు..!

విజయవాడ, ఫిబ్రవరి 4 ఈస్ట్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: తిరుపతిలోని మహతి ఆడిటోరియం వేదికగా సాధు సంత్స్ పరివార్ ఆధ్వర్యంలో జరిగిన “హిందూ ధార్మిక సదస్సు” అద్భుత విజయంతో ముగి సింది. సనాతన ధర్మ పరిర క్షణే లక్ష్యంగా సాధు సంత్స్ పరివార్ జాతీయ అధ్యక్షు లు త్రిపుర భైరవేశ్వరానంద స్వామీజీ సారథ్యంలో జరి గిన ఈ మహాసభకు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుండి సుమారు 700 మంది పీఠాధిపతులు, మఠాధి పతులు, నాగ సాధువులు అఘోర స్వామీజీలు తరలి వచ్చారు. ఈ సదస్సులో హిందూ ధర్మం ఎదుర్కొం టున్న సవాళ్లు సాధు సం తుల సంక్షేమం, భవిష్యత్ కార్యాచరణ వంటి పలుకీ లక అంశాల మీద విస్తృతం గా చర్చించారు. సనాతన ధర్మాన్ని కాపాడటంలో సాధువుల పాత్ర ఐక్యతను చాటి చెప్పే దిశగా పలు తీర్మానాలు చేశారు. ఈ చారిత్రాత్మక సదస్సులో అనేకమంది ఆధ్యాత్మిక దిగ్గజాలు పాల్గొని తమ దివ్య సందేశాలను అందిం చారు. తదితర సాధుశ్రేణు లు ఈ కార్యక్రమంలో పాల్గొని సదస్సును దిగ్విజ యం చేశారు. సాధు సంత్స్ పరివార్ జాతీయ అధ్యక్షు లు పూజ్యశ్రీ త్రిపుర భైరవే శ్వరానంద స్వామీజీ పాల్గొన్నారు. ఈ మేరకు మాట్లాడుతూ సాధువులం తా ఏకతాటిపైకి వచ్చి ధర్మాన్ని కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందని మన ఐక్యతే మన బలం అని పిలుపు నిచ్చారు. ఇంతటి భారీ స్థాయిలో సాధువులంతా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయ వంతం చేయడం ధర్మ విజయమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్ర మంలో శివ రుద్ర మౌన సరస్వతి స్వామీజీ,డాక్టర్ కృష్ణచాముండేశ్వరి స్వామీజీ, శంకర్ స్వామీజీ (సాధు పరిషత్, తెలంగా ణ), అరుణాచల రుద్రాక్ష స్వామీజీ, బెనారస్ స్వామీ జీ, కాలభైరవ స్వామీజీ, లక్ష్మీపతి స్వామీజీ, డాక్టర్ కోదండ రామాచార్యులు స్వామీజీ, కాళీ మహాకాళి రమణ అఘోర సాధక్ స్వామీజీ, వీర బ్రహ్మజ స్వామీజీ, సద్గురు రాజ ఋషి ఆత్మానంద స్వామీ జీ (విజయవాడ)మహర్షి సాధు మహారాజ్ రఘోత్త మాచార్యులు, నరహరి స్వామీజీ, నాగలక్ష్మి మాతా జీ, శ్రీమంతుల పార్వతి మాతాజీ, ఆలపాటి అంజ నీ దేవి మాతాజీ, కోట్ల రాజ య్య స్వామీజీ, త్యాగరాజ స్వామీజీ, యోగేష్ అఘోర స్వామీజీ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా సీనియర్ జర్నలిస్ట్ సత్య జన్మదిన వేడుకలు

ఎల్‌పీజీ కొరతపై కేంద్రానికి రాష్ట్ర విజ్ఞప్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *