యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 04 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజక వర్గంలోని కైలాస పురం కాచారం గ్రామం లో శ్రీ రేణుక వాసవి బసవలింగేశ్వర దేవాలయం 29వ వార్షికోత్సవం మరియు అన్నపూర్ణ అన్న సత్రం 30వ వార్షిక మహోత్సవ ఫలహార పండుగ ముగింపు వేడుకలకు ముఖ్యఅతిథిగా పాల్గొనీ పూజా కార్యక్రమాలు నిర్వహించారు తెలంగాణ మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ శ్రీమతి బండ్రు శోభారాణి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవాలయ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి గత మూడు దశాబ్దాలుగా దేవాలయ నిత్య పూజాకాంకర్యాలు నిర్వహిస్తూ సరైన మార్గం లేని ఈ దేవాలయానికి ఎంతో మంది భక్తులను ఆహ్వానిస్తూ అమ్మవారి ఆశీర్వాదాన్ని అందజేస్తున్న వారి సతీమణి శ్రీమతి విజయలక్ష్మినీ కూడా అభినందిస్తూ ఎంతో మహిమాన్వితమైన ఈ దేవాలయాన్ని నేను పలుమార్లు సందర్శించి ప్రతి మంగళవారం జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమాలకు హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఈ దేవాలయానికి వచ్చి కమ్మవారి పూజలో పాల్గొంటే కొంగుబంగారమై కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధిగాంచిందని భక్తుల నమ్మకం అని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు నీలం పద్మ, IHRCI సిద్దిపేట జిల్లా మహిళా అధ్యక్షురాలు సామా ప్రశాంతి, ఆలేరు మున్సిపాలిటీ ఏడవ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి బీజన బాలమణి భాస్కర్, మాజీ ఎంపీపీ దడిగ యిస్తారి, యాదగిరిగుట్ట స్థానిక నాయకులు సిద్దంకి బాల్రెడ్డి, ధర్మారెడ్డి గూడెం సర్పంచి కొల్లూరు రాజయ్య, నాచారం లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం వాసవి కన్యక కన్యకా పరమేశ్వరి నిత్యానదాన సత్రం అధ్యక్షులు కొమురవెల్లి శంకరయ్య గుప్తా, గజ్వేల్ ఏఎంసీ మార్కెట్ డైరెక్టర్ సముద్రాల హరినాథ్ గుప్తా, ఆలేరు ఆర్యవైశ్య సంఘం నాయకులు బెజ్జాల విశ్వనాథం గుప్తా, మార్కండేయ భక్త బృందం సభ్యుడు పాండు మరియు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.

