Breaking News

బీఆర్ఎస్ ‘జాతిపిత’ కామెంట్స్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ 🔥

కేసీఆర్ ఎవరికి జాతిపిత..? అంటూ మున్సిపల్ ఎన్నికల్లో పొలిటికల్ రచ్చ.

నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: మున్సిపల్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. బీఆర్ఎస్ చేస్తున్న ‘జాతిపిత’ ప్రచారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. కేసీఆర్‌ను తెలంగాణ జాతిపితగా ప్రస్తావించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. “అలాంటి పనులు చేసిన వాళ్లు జాతిపిత అవుతారా?” అంటూ తనదైన శైలిలో బీఆర్ఎస్‌పై విరుచుకుపడ్డారు. మిర్యాలగూడలో మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్, బీఆర్ఎస్ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఎవరికి జాతిపిత అని ప్రశ్నించారు. “ఇతరుల ఫోన్లు వినిపించిన చరిత్ర ఉన్నవాళ్లు జాతిపితలా?” అంటూ పరోక్షంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియా గాంధీ అని, తెలంగాణ ఉద్యమానికి ప్రాణత్యాగం చేసిన జయశంకర్‌ను జాతిపితగా గుర్తించాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు.

రాయచోటి మున్సిపాలిటీ త్రాగునీటి కోసం రూ.150 కోట్లు కేటాయించాలని ప్రతిపాదన.

సీఎం వ్యాఖ్యలకు అదే స్థాయిలో బీఆర్ఎస్ నుంచి కౌంటర్ వచ్చింది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు స్పందిస్తూ… “జాతిపిత అంటే ఏంటో రేవంత్ రెడ్డికి తెలుసా?” అంటూ ప్రశ్నించారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడ్డ చరిత్ర కేసీఆర్‌దని అన్నారు. తెలంగాణ సాధన కోసం రేవంత్ రెడ్డి ఎప్పుడైనా పోరాడారా అంటూ నిలదీశారు.జాతిపిత అంశంపై అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం రాజకీయ హీట్‌ను మరింత పెంచుతోంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ఇంకా కొద్ది రోజులు ఉండటంతో… ఈ వివాదం రానున్న రోజుల్లో మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల ఫలితాలపై కూడా ఈ రాజకీయ రచ్చ ప్రభావం పడుతుందా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ప్రభుత్వ విప్ శాసన సభ్యురాలు గొంగిడి సునీత.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *