బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

యువ న్యాయవాది స్వప్న హత్యకు నిరసనగా న్యాయవాదుల విధులు బహిష్కరణ.

కోదాడ, ఫిబ్రవరి 5(నేటి తెలుగు పత్రిక): రంగారెడ్డి జిల్లా చేవెళ్ల కోర్టులో పని చేస్తున్న యువ మహిళా న్యాయవాది స్వప్న ను అతి కిరాతకంగా హత్య చేయడాని తీవ్రంగా ఖండిస్తూ గురువారం నాడు కోదాడ కోర్టులో న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఉయ్యాల నర్సయ్య మాట్లాడుతూ ఒక న్యాయవాది న్యాయంగా తనకు రావాల్సిన హక్కుల కోసం కుటుంబంలోనే పోరాడుతుంటే పోలీసులు, రాజకీయ పెద్దలు ఆమెకు సహకరించకపోవడం, ఉదాసీనంగా వ్యవహరించడం వలన నేడు ఆమె హత్యకు గురైందని ఆయన ఆరోపించారు. సమాజంలో న్యాయవాదులకు రక్షణ కరువైందని, వారు చట్టాన్ని, న్యాయాన్ని కాపాడడం కోసం పనిచేస్తున్న క్రమంలో అనేక దాడులు, దౌర్జన్యాలు ఎదుర్కొంటున్నారని, న్యాయవాదులు తమ ప్రాణాలను కోల్పోతున్నారని ఆయన వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు న్యాయవాదులకు రక్షణ చట్టం తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు యడపల్లి వెంకటేశ్వర్లు, కోడూరు వెంకటేశ్వరరావులు,వి.ధనలక్ష్మి,కరీం,నయిమ్,హుస్సేన్, చలం,కె.మురళి,సీనియర్ న్యాయవాదులు తమ్మినేని హనుమంతరావు, ఈదుల కృష్ణయ్య,వి.రంగారావు, రామిరెడ్డి,రంజాన్ పాషా,బాలయ్య, రహీం,పాషా,హేమలత, భవాని,శిల్ప,మంద వెంకటేశ్వర్లు, వీరభద్రరావు,గోవర్ధన్,ముల్క వెంకటరెడ్డి,దొడ్డ శ్రీధర్, రియాజ్, మీరా,శరత్,నాగరాజు,శ్రీనివాస్,అవినాష్ తదితరులు పాల్గొన్నారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు