Breaking News

ఫ్యాన్స్ గెట్ రెడీ..! ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వచ్చేస్తున్నాడు 🔥

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాస్ ఎంటర్‌టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్.

నేటి తెలుగు పత్రిక : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ సూపర్ హిట్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ హైప్ నెలకొంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.పవన్ కల్యాణ్ ప్రస్తుతం రాజకీయాలు, సినిమాలు రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ బిజీగా ఉన్నారు. ఏపీ డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతలు నిర్వహిస్తూనే, సమయం దొరికినప్పుడల్లా సినిమాల కోసం పనిచేస్తున్నారు. గత ఏడాది ‘హరిహర వీరమల్లు’, ‘ఓజీ’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో ‘ఓజీ’ భారీ విజయాన్ని అందుకోగా ‘హరిహర వీరమల్లు’ మాత్రం అభిమానుల అంచనాలను పూర్తిగా అందుకోలేకపోయింది.

రాయచోటి మున్సిపాలిటీ త్రాగునీటి కోసం రూ.150 కోట్లు కేటాయించాలని ప్రతిపాదన.

ఇక ఇప్పుడు హరీష్ శంకర్‌తో కలిసి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ద్వారా మళ్లీ ఫుల్ మాస్ అవతార్‌లో కనిపించబోతున్నారు పవన్ కల్యాణ్. గతంలో ఈ ఇద్దరి కలయికలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అదే రేంజ్‌లో ఈ సినిమాపై కూడా అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు ప్రేక్షకుల్లో అదిరిపోయే హైప్‌ను క్రియేట్ చేశాయి. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ సందర్భంగా రిలీజ్ డేట్‌తో కూడిన స్టైలిష్ పోస్టర్‌ను విడుదల చేయగా పవన్ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లోకి వెళ్లిపోయారు.ఇక థియేటర్లలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఎలాంటి రచ్చ చేయబోతోందో చూడాలి. పవర్ స్టార్ మాస్ ఫ్యాన్స్‌కు ఇది పక్కా ఫీస్ట్ కానుందన్న అంచనాలు బలంగా ఉన్నాయి.

శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ప్రభుత్వ విప్ శాసన సభ్యురాలు గొంగిడి సునీత.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *