బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

దోమల నియంత్రణకు విస్తృతమైన చర్యలు చేపట్టాలి

విజయవాడ. ఫిబ్రవరి 5 పశ్చిమ నియోజకవర్గం నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: దోమల నియంత్రణకు విస్తృతమైన చర్యలు చేపట్టాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషన ర్ ధ్యానచంద్ర అన్నారు. ఈ సందర్భంగా గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా విశాలాంధ్ర రోడ్డు, మధుర నగర్, రామకృష్ణా పురం, గులాబీ తోట ప్రాంతాలని పర్యటించి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ మేరకు కమిషనర్ మాట్లాడుతూ ప్రజలకు దోమల వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు తలె త్తకుండా దోమలను నియంత్రించే చర్యలు తీసుకోవాలని, కేవలం మలేరియా సిబ్బందినే కాకుండా పూర్తి గా ప్రజా ఆరోగ్య శానిటరీ ఇన్స్పెక్టర్లను కూడా భాగ స్వామ్యం చేస్తూ నగర పరిధిలో యాంటీ లార్వా ఆపరేషన్లు విస్తృతంగా నిర్వహించాలని ఆదేశిం చారు. నగర పరిధిలో గల డ్రైన్ లలో పూడికలు తీయాలని, బందర్, రైవస్, ఏలూరు, బుడమేరు కాలువల్లో, నగర పరిధిలో గల కృష్ణానది లో పేరుకు పోయిన వ్యర్ధాలను తొల గించాలని, నగర శివారుల లో కూడా వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించే టట్టు చర్యలు తీసుకోవాల ని అన్నారు. ప్రజలు సైడ్ కాలవలో, బందర్, రైవస్, ఏలూరు, కాలువల్లో, కృష్ణా నదిలో వ్యర్థాలను వేయ కుండా, నగరపాలక సంస్థ వారు చేసే చర్యలకు సహ కరించి, వ్యర్థాలను కేవలం పారిశుధ్య కార్మికుల వారికి మాత్రమే ఇవ్వాలని కోరా రు. ప్రజారోగ్య సిబ్బంది కూడా ప్రజలకుమైకు ద్వారా ప్రచారం చేసి అవగాహన కల్పించాలని అన్నారు. తదుపరి రాణి గారి తోట అన్న క్యాంటీన్ ను క్షేత్రస్థాయిలో పరిశీలిచి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా త్రాగునీరు, వాడుక నీటి సరఫరా లో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలి అని క్యాంటీన్లో పారి శుధ్య నిర్వహణలో ఎటువంటి లోపం ఉండరాదని ఎప్పటికప్పుడు ఏమైనా మరమ్మతులు ఉంటే వెంటనే చేయించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ మెడిక ల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె. అర్జునరావు, చీఫ్ ఇంజనీర్ ఇంచార్జ్ పి. సత్యకుమారి, జోనల్ కమిషనర్ ప్రభు దాస్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎ శ్రీనివాస్ రెడ్డి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ జగదీష్, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ అన్నపూర్ణ, సిబ్బం ది తదితరులు పాల్గొన్నారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు