Breaking News

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని కోరుతూ తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా

ఎ. కొండూరు ఫిబ్రవరి 5 ,(నేటి తెలుగు పత్రిక): 2005 వ సంవత్సరం లో యూపీఏ గవర్నమెంట్ తీసుకువచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొన సాగించాలని, సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఎ. కొండూరు తహశీల్దార్ కార్యాలయం వద్ద గురువారం ధర్నా నిర్వహించారు.ఈ ధర్నా లో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి పానెం ఆనందరావు పాల్గొని మాట్లాడుతు మోడీ గవర్నమెంట్ తీసుకు వచ్చిన చట్టం వల్ల ఉపాధి హామీ కార్మికులకుతీవ్ర నష్టం జరుగుతుందని వెంటనే వీబీజీ రామ్ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం నాయకులు జెట్టి వెంకటేశ్వరావు మాట్లాడుతూ పాత చట్టాన్ని పకడ్బందీగాఅమలు చేయాలని, పని ఎప్పుడు అడిగితే అప్పుడు కల్పించాలని, బడ్జెట్ లో నిధులు పెంచాలని, 200 రోజులు పనులు కల్పించాలని, కనీస వేతనం 600 రూపాయలు ఇవ్వాలని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ ధర్నా లో సిపిఎం నాయకులు ఆళ్ల అమ్మిరెడ్డి, పంబి వెంకటేశ్వరావు, రావుల రామకృష్ణ, కేవల, కూలీలు పి.సీతారావమ్మ,కుమారి,జమలమ్మ, పుల్లయ్య, సిహెచ్ వెంకటేశ్వరావు, సోమ యోహాను, ఎస్.ఆనందరావు,తదితరులు పాల్గొన్నారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహశీల్దార్ ఎన్. అరవింద్ కు అందజేశారు.

ఘనంగా సీనియర్ జర్నలిస్ట్ సత్య జన్మదిన వేడుకలు

ఎల్‌పీజీ కొరతపై కేంద్రానికి రాష్ట్ర విజ్ఞప్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *