బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

అక్రమ మద్యం రహిత రాష్ట్రంగా ఘనత సాధించిన ఏపీ : ‌ మంత్రి రవీంద్ర

అక్రమ మద్యం రహిత రాష్ట్రంగా ఘనత సాధించిన ఏపీ : ‌ మంత్రి రవీంద్ర

నవోదయం 2.0 కింద నిరంతర నిఘా.

అమరావతి, ఫిబ్రవరి 5 నేటి తెలుగు పత్రిక: నవోదయం 2.0 కార్యక్రమం కింద ఆంధ్రప్రదేశ్‌ను అక్రమ మద్యం తయారీ (ఇలిసిట్ డిస్టిలేషన్) రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దామని ఎక్సైజ్‌, గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గురువారం అమరావతిలోని ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో ఎక్సైజ్‌ శాఖ పనితీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అక్రమ మద్యం వల్ల ప్రజల ఆరోగ్యం, భద్రతకు కలిగే నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని 2025 ఫిబ్రవరిలో నవోదయం 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించామని, సమన్వయంతో కూడిన కఠిన చర్యల ఫలితంగా 2025 డిసెంబర్ నాటికి రాష్ట్రం ఐడీ రహితంగా నిలిచిందని మంత్రి చెప్పారు. అయితే ఇదే స్థాయిలో నిరంతర నిఘా కొనసాగించాల్సిన అవసరం ఉందని, అలవాటు పడిన నేరస్తులను పునరావాసం ద్వారా మళ్లీ నేరాల వైపు వెళ్లకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు

ఎక్సైజ్‌ శాఖ ఆదాయ పనితీరును సమీక్షించిన మంత్రి, ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ఆదాయం కంటే ప్రజా సంక్షేమమేనని స్పష్టం చేశారు. ఎక్సైజ్‌ పాలసీ 2025–28 కింద బార్ల కేటాయింపులపై స్పందిస్తూ, ఓపెన్‌ కేటగిరీలో 840 బార్లు, గీతా కులాలకు 84 బార్లు నోటిఫై చేసినట్లు తెలిపారు. 2025 ఆగస్టు, సెప్టెంబర్‌లో జరిగిన తొలి రెండు దశల్లో 625 బార్లు కేటాయించగా, గురువారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన మూడో దశ డ్రాలో 194 బార్లు కేటాయించినట్లు చెప్పారు. మిగిలిన 107 బార్లను త్వరలోనే మళ్లీ నోటిఫై చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అబ్కారీ, గనుల శాఖముఖ్య కార్యదర్శి ముకేష్‌ కుమార్‌ మీనా, ఎక్సైజ్‌ ,‌ ప్రొహిబిషన్‌ డైరెక్టర్‌ చామకూరి శ్రీధర్, అదనపు కమిషనర్‌ ఎం. దేవకుమార్, ఏపీఎస్‌బీసీఎల్‌ జనరల్‌ మేనేజర్‌ అనసూయ దేవి తదితరులు పాల్గొన్నారు.