పులివెందుల ఫిబ్రవరి 6 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): తిరుమల లడ్డు విషయం లో కృతిమ నెయ్యి వాడకం ఫై కేంద్ర ప్రభుత్వం సూచనలు మేరకు నిబంధనలు మార్చామని వైసీపీ నేతలు చెప్పడం దారుణమైన విషయం అని బ్రాహ్మణ చైతన్య వేదిక నాయకులు సూగురు రఘునాథరావు పీవీయెస్ వి ప్రసాదరావు లు విమర్శించారు. రాష్ట్రము లో పాడి పరిశ్రమ పెంచా లనే ఉద్దేశ్యం తో పాల నుండి వచ్చే నెయ్యి లడ్డు తయారికి ఉపయోగ పడుతుందనే ఉద్దేశ్యం తో సూచనలు చేసారు తప్ప పాలు లేకుండా నెయ్యి తయారు చేయమని ఎక్కడ సూచించలేదని విమర్శించారు. కేవలం టీటీడీ నిధులు స్వాహా చేయాలనే ఉద్దేశ్యం తో నిబంధనలు సదలించి ఇప్పుడు నెపం కేంద్ర ప్రభుత్వం ఫై వేయడానికి బీజేపీ ని లాగు తున్నారని విమర్శించారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కి ద్రోహం చేయడం పాలక మండలికి చెల్లిందని అన్నారు. కేవలం 235కోట్లు కొల్ల గొట్టడానికి అప్పటి పాలకమండలి తీవ్రమైన తప్పిదాలు చేసారని ఆరోపించారుఎన్ డి డి బి ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం కల్తీ నెయ్యిలో జంతువు ల కొవ్వు.కూడా కలిసిందని పేర్కొనడం జరిగింది తప్ప ఎవరి సొంత అభిప్రాయం కాదని తెలిపారు. సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన సిట్ నేరస్థులను పూర్తిగా బయట పెట్టక పోవడంతో ఇన్ని విమర్శలు కు అవకాశం ఏర్పడిందని అన్నారు.సిట్ కేవలం తప్పులు చూపుతూ సంబంధిత అధికారులు ఫై చర్యలు తీసుకోవాలి అని పేర్కొనడం జరిగింది తప్ప ఎవరి ఆదేశాలు ప్రకారం జరిగింది చెప్పక పోవడం తో సమస్య ఏర్పడింది. అని చెప్పారు. బోర్డు లో నిబంధనలు మార్చి తప్పుకు అవకాశం ఇచ్చింది చైర్మన్ కాదా అని ప్రశ్నించారు. పూర్తి స్థాయి విచారణ జరిపి స్వామి కి ద్రోహం చేసి భక్తుల మనోభావాలు దెబ్బ తీసిన వ్యక్తులు ఫై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు
