బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

మున్సిపల్ ప్రచారంలో క్రేజీ మూమెంట్..!

మున్సిపల్ ప్రచారంలో క్రేజీ మూమెంట్..!

లాండ్రీ షాపులోకి వెళ్లి బట్టలు ఇస్త్రీ చేసిన మంత్రి.. ఎవరో తెలుసా..?

నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం రోజురోజుకూ హీటెక్కుతోంది. పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండటంతో నేతలు ప్రచారంలో దూకుడు పెంచారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు కొందరు నేతలు సంప్రదాయ ప్రసంగాలకు భిన్నంగా వినూత్న ప్రచారంతో వార్తల్లో నిలుస్తున్నారు.ఈ కోవలోనే రాష్ట్ర మంత్రి ఒకరు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక్కసారిగా లాండ్రీ షాపులోకి వెళ్లి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.హుజూర్‌నగర్ మున్సిపాలిటీ 17వ వార్డులో ప్రచారం చేస్తున్న సమయంలో పక్కనే ఉన్న లాండ్రీ దుకాణాన్ని గమనించిన మంత్రి లోపలికి వెళ్లి అక్కడ బట్టలు ఇస్త్రీ చేస్తున్న లాండ్రీ మెన్‌తో మాట్లాడారు. అంతే కాదు ఆయన చేతిలోని ఇస్త్రీ పెట్టెను తీసుకుని మంత్రి ఉత్తమ్ స్వయంగా బట్టలను ఐరన్ చేశారు.

ఈ సందర్భంగా లాండ్రీ మెన్‌ను ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా..? జీవనం ఎలా సాగుతోందని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలతో నేరుగా మమేకమవుతూ చేసిన ఈ వినూత్న ప్రచారం అక్కడున్నవారిని ఆకట్టుకుంది.మంత్రిని ఇలా ఇస్త్రీ చేస్తూ చూడటం ఊహించని విషయం కావడంతో అక్కడున్నవారు వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది.ప్రచారంలో మాటలకే పరిమితం కాకుండా నేల మీదకి వచ్చి ప్రజల జీవనాన్ని చూసే ప్రయత్నమే ఇదంటూ నెటిజన్లు ఈ వీడియోపై కామెంట్లు చేస్తున్నారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు