బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

జగన్ మీద కక్షతో చంద్రబాబు తిరుమల ప్రతిష్టను దెబ్బతీయడం శోచనీయం: డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి

జగన్ మీద కక్షతో చంద్రబాబు తిరుమల ప్రతిష్టను దెబ్బతీయడం శోచనీయం: డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి

పులివెందుల ఫిబ్రవరి 6 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): జగన్ మీద కక్షతో, జగన్ ను రాజకీయంగా దెబ్బతీయాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల ప్రతిష్టను, తిరుమల లడ్డు ప్రతిష్టను, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను దెబ్బతీయడం దురదృష్టకరం,శోచనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి ఆవేదన వెలుబుచ్చారు. శుక్రవారం వేంపల్లి లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేశంలోని అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సిబిఐ ఏర్పాటు చేసిన సిట్ నివేదిక ఇవ్వడం, ఏసీబీ కోర్టులో చార్జి సీటు వేయడం జరిగిందని అన్నారు. ఈ చార్జ్ షీట్ లో టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో నెయ్యి లేదు,జంతువుల కొవ్వు ఉందని నిర్ధారణ కాలేదు, ఇందులో పామాయిల్, పామ్ కర్నెల్ ఆయిల్ బీటా కెరోటిన్ ఉన్నట్లు పేర్కొనడం జరిగింది.60 లక్షల కిలోల సరఫరా చేయడం జరిగిందని,20.01 కోట్ల లడ్లు తయారు చేయడం జరిగిందని, ఇందులో దాదాపు 250 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని,36 మంది నిందితులను చార్జ్ సీట్లో పేర్కొనడం జరిగింది.అందులో సరఫరాదారులైన ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ,బోలె బాబా డైరీ, టిటిడి అధికారులు,టీటీడీ ఉద్యోగులు ఉన్నారు. ఈ చార్జ్ షీట్ ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సింది పోయి చంద్రబాబు నాయుడు,పవన్ కళ్యాణ్, కూటమి నాయకులు పదేపదే జంతువుల కలిసిందని టామ్ టామ్ చేయడం అత్యంత దురదృష్టకరమన్నారు. దీనివలన జగన్ ప్రతిష్ట బదులు వెంకటేశ్వర స్వామి,టీటీడీ,తిరుమల లడ్డు ప్రతిష్ట దెబ్బతింటున్నదని కూటమి నాయకులు ఆలోచించకపోవడం శోచనీయం. ఒక విధంగా చెప్పాలంటే కూటమి నాయకులు సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నారు. ఇప్పటికైనా జంతువుల కొవ్వు కలిసింది అన్న ప్రచారం మాను కొని సిట్ వేసిన చార్జి షీట్ ఆధారంగా,అవినీతి ఆధారంగా నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం మంచిదని కూటమి ప్రభుత్వానికి తులసి రెడ్డి సూచించారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు