బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

సమాజమే ఆవిష్కరించబడాలి.

సమాజమే ఆవిష్కరించబడాలి.
  • క్యాపిటల్ ఇన్ఫర్మేషన్ క్యాలెండర్ ఆవిష్కరణలో ఆర్.పి.వి ఫౌండర్, జాతీయ అధ్యక్షులు సయ్యద్ సాదిక్ అలీ.

ఖమ్మం, ఫిబ్రవరి 06, నేటి తెలుగు పత్రిక: మూర్ఖత్వపు పరిమళాలు వెదజల్లబడుతున్న ఈ కాలంలో సమాజమే ఆవిష్కరించబడాల్సిన అవసరం ఉందని రాజ్యాంగ పరిరక్షణ వేదిక (ఆర్.పి.వి) ఫౌండర్ జాతీయ అధ్యక్షులు సయ్యద్ సాదిక్ అలీ అన్నారు. శుక్రవారం నిజాంపేటలో క్యాపిటల్ ఇన్ఫర్మేషన్ పత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజంపై ఉద్దేశపూర్వక దాడులు జరిగినప్పుడు ఆ సమాజంలోని సభ్యులు ప్రతిఘటించకపోతే కాలక్రమేణా అదే సమాజం అంతమైపోతుందని హెచ్చరించారు. అందుకే రాజ్యాంగ విలువల ఆధారంగా సమాజం మళ్లీ ఆవిష్కరించ బడాలని పిలుపునిచ్చారు.

సమాజం మారాలంటే ముందుగా మన ఆలోచనలు మారాలని, మార్పు చట్టాలతో కంటే చైతన్యంతోనే వస్తుందని ఆయన స్పష్టం చేశారు. అన్యాయాన్ని ప్రశ్నించే ధైర్యం, అసమానతలను ఖండించే స్వరం, మానవత్వాన్ని నిలబెట్టే సంకల్పం ప్రతి ఒక్కరిలో వెలిగినప్పుడే నిజమైన పరివర్తన మొదలవుతుందని తెలిపారు. అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, భవనాలు కాదని; గౌరవం, సమానత్వం, అవకాశాల సమన్వయమే సార్థక అభివృద్ధి అని పేర్కొన్నారు.

విద్య, ఆరోగ్యం, ఉపాధి—ఈ మూడింటిపై సమాజం సమానంగా నిలబడినప్పుడే ప్రజాస్వామ్యానికి ప్రాణమైన ఐక్యత బలపడుతుందని సాదిక్ అలీ అన్నారు. నిన్నటి తప్పులను సరిదిద్దుకుంటూ, నేటి బాధ్యతను స్వీకరిస్తూ, రేపటి తరాలకు న్యాయం చేసే దిశగా అడుగులు వేయాలని సూచించారు. వ్యక్తి మారితే కుటుంబం, కుటుంబం మారితే గ్రామం, గ్రామం మారితే దేశం అలా మార్పు చక్రం తిరగాలన్నారు. అందుకే ‘సమాజమే ఆవిష్కరించబడాలి’ అన్న సందేశాన్ని పునరుద్ఘాటించారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు

ఈ కార్యక్రమంలో ఆర్ పి వి నిజాంపేట విభాగానికి చెందిన నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

నిజాంపేట అధ్యక్షులు డా. ఖిజరుల్లా, కార్యదర్శి మొహమ్మద్ అహ్మద్ (మున్నా), సలహాదారు హబీబ్, మాజీ కార్పొరేటర్ మజీద్, డా. ఫయాజ్, రజీయుద్దీన్, జహూర్, మౌలాలి, మహబూబ్, ముజఫ్ఫర్, మహబూబ్ అలీ, అబ్దుల్ నబీ, షఫీక్, ఇల్లియాస్, ఇమామ్, ఆజం తదితరులు పాల్గొన్నారు. సమాజంలో రాజ్యాంగ విలువల పరిరక్షణ, సామాజిక చైతన్యాన్ని పెంపొందించడంలో ఆర్ పి వి పాత్ర కీలకమని పేర్కొంటూ, ఇలాంటి కార్యక్రమాలు మరింత విస్తృతంగా జరగాలని వారు ఆకాంక్షించారు.