Breaking News

బాధితురాలకి న్యాయం జరిగేలా కమిషన్ చర్యలు తీసుకుంటుంది…!

విజయవాడ, ఫిబ్రవరి 6 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: బాధితురాలి కుటుంబానికి అండగా ఉండి పూర్తి స్థాయిలో న్యాయం జరిగే లా మహిళా కమిషన్ చర్య లు తీసుకుంటుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్స న్ రాయపాటి శైలజ అన్నారు. మెడికో దీపిక మృతి చెందిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ శ్రీమతి రాయపాటి శైలజ శుక్రవా రం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి, ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులను, తోటి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మీడియా ప్రతినిధులతో చైర్ పర్సన్ మాట్లాడుతూ మెడికో దీపిక మృతి చెందడం చాలా దురధృష్టకరమని, ఈ విషయంలో వారి కుటుంబ సభ్యులకు మహిళా కమిషన్ అండగా నిలుస్తుందన్నారు.​ బాధితురాలు గత మూడేళ్లుగా ఇక్కడే చదువుతోందని, ఆమె ప్రవర్తనలో ఏవైనా మార్పులు వచ్చాయా లేదా ఏదైనా ఒత్తిడి ఉందా అనే కోణంలో తోటి విద్యార్థులు, సహచర డాక్టర్లతో చైర్‌పర్సన్ వ్యక్తిగతంగా మాట్లాడారు. దీపిక చాలా ప్రతిభావం తురాలని, ఆమె ప్రవర్తనలో ఎలాంటి అసాధారణ మార్పులు లేవని విద్యార్థులు తెలిపారన్నారు. ​మృత దేహంపై ఉన్న ‘పంక్చర్ మార్క్స్’ (సూది గుర్తులు) దేనివల్ల వచ్చాయనేది తేలాల్సి ఉందని చైర్‌పర్స న్ పేర్కొన్నారు. నమూనా లను (Tissues) బయా ప్సీ, ఎఫ్ఎస్ఎల్ పరీక్షల కోసం పంపామని, ఈ నివేదికలు రావడానికి రెండు నుండి మూడు వారాల సమయం పడుతుందని అధికారులు వివరించారన్నారు. ​ఆహారం వల్ల విషప్రయోగం జరిగి ఉండ వచ్చనే అనుమానాలను ఆమె తోసిపుచ్చారు. దీపిక తో కలిసి భోజనం చేసిన మరో జూనియర్ డాక్టర్ ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు. ప్రాథమిక సమా చారం ప్రకారం వాంతుల నివారణకు వాడే ‘ఆండన్సె ట్రాన్’ ఇంజెక్షన్ తీసుకున్న ట్లు తెలుస్తోందని వివరించారు. ​కేసు దర్యాప్తులో భాగంగా కాల్ డేటా రికార్డ్స్ (CDR), పోస్ట్‌మార్టం నివేదికల కోసం వేచి చూస్తున్నట్లు ఆమె తెలిపారు.ఫోరెన్సిక్ రిపోర్టులు వచ్చన తర్వాతే ఇది ఆత్మహ త్యా లేక ఇతర కారణాలా అనేది స్పష్టమవుతుందన్నారు. బాధితురాలి కుటుంబానికి పూర్తి స్థాయి లో న్యాయం జరిగేలా మహిళా కమిషన్ చర్యలు తీసుకుంటుందన్నారు. దర్యాప్తు పారదర్శకంగా జరిగేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశామని చైర్ పర్సన్ రాయపాటి శైలజ పేర్కొన్నారు. చైర్ పర్సన్ విజిట్ లో ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ ఆలపాటి ఏడుకొండల రావు, ఆర్ఎంవోలు ఉన్నారు.

మంత్రి నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు

ప్రగతి నారి శక్తి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా శ్రీమతి ఉమా దేవి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *