సూర్యాపేట శాసనసభ నియోజకవర్గంలో సేద్యానికి పూర్తి స్థాయిలో నీరు అందిస్తాం.
దొడ్డు బియ్యం సరఫరాతో వృధా అవుతున్న 12000 కోట్లు.
అదనపు భారం అయినా పేదలకు ఉచితంగా నాణ్యమైన సన్న బియ్యం.
డబుల్ బెడ్ రూమ్ ల పేరుతో బి.ఆర్.ఎస్ పాలకులు ప్రజలను మభ్య పెట్టారు.
ధాన్యం దిగుబడితో పాటు కొనుగోలులోనూ ఆల్ టైం రికార్డు.
148 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి.
ప్రభుత్వం కొనుగోలు చేసింది 72 లక్షల మెట్రిక్ టన్నులు.
మద్దతో ధరతో పాటు రైతులకు చెల్లించిన బోనస్ మొత్తం 19,000 కోట్లు.
పురపాలక సంఘము ఎన్నికల్లో క్లిన్ స్వీప్ చేయనున్న కాంగ్రెస్.
సమన్వయంతో పని చేస్తే అద్భుతమైన ఫలితాలు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు పెరుగుతున్న విశ్వసనీయత.
వర్తక,వ్యాపార,వాణిజ్య వర్గాలకు వెన్నుదన్నుగా కాంగ్రెస్ ప్రభుత్వం.
బి.సి.,ఎస్సీ, ఎస్.టి,మైనార్టి వర్గల అభ్యున్నతికి కృషి సూర్యాపేటలో అంతిమ విజయం కాంగ్రెస్ దే: మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి.
సూర్యాపేట, ఫిబ్రవరి 9(నేటి తెలుగు పత్రిక): శ్రీరాంసాగర్ రెండో దశను ఆధునికరించి సూర్యాపేట శాసనసభ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.తద్వారా నియోజకవర్గ పరిధిలోని చివరి అంచు వరకు సేద్యానికి వెసులుబాటు అవుతుందని ఆయన చెప్పారు.పురపాలక సంఘం ఎన్నికలను పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆదివారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు .అంతకు ముందు సూర్యాపేట మెడికల్ కాలేజ్ నుండి పాత బస్ స్థాన్డ్ ,పొట్టి శ్రీరాములు సెంటర్ మీదుగా తెలంగాణా తల్లి విగ్రహం వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి,సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి,ఏ.ఐ. సి.సి సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి,డి సి సి అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, పి.సి సి ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారుఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ బి.ఆర్.ఎస్ పాలనలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు పంపిని చేసిన దొడ్డు బియ్యం తినడానికి ప్రజలు విముఖత చూపడంతో పక్క దారి పట్టి అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయన్నారు.తద్వారా దొడ్డు బియ్యం మీద రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న ఖర్చు 12000 కోట్లు వృధా కావడంతో పాటు ప్రభుత్వం పంపిణీ చేసిన దొడ్డు బియ్యం దారి మళ్ళీ బీర్ల కంపెనీలకు,కోళ్ల ఫారాలకు అక్రమంగా తరలి పోయాయని ఆయన ఆరోపించారు.వీటన్నింటినీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం సమగ్రంగా అధ్యయనం జరిపి పేదల కళ్ళలో వెలుగులు నింపేందుకు గాను ఉచితంగా నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిందని ఆయన తెలిపారు.
యావత్ భారతదేశంలోనే మొట్ట మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టిన ఈ విప్లవాత్మకమైన కార్యక్రమం ద్వారా రాష్ట్ర జనాభాలో 85% మందికి లబ్ది చేకూరుతుందని ఆయన తెలిపారు.పదేళ్ల బి.ఆర్ ఎస్ పాలనలో డబుల్ బెడ్ రూమ్ ల పేరుతో ప్రజలను మభ్యపెటారని ఆయన విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాకా ప్రతీ శాసనసభ నియోజకవర్గానికి 3,000 ఇల్లు మంజూరు చేస్తున్న అంశాన్ని ఆయన గుర్తు చేశారు.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా అనుసరించిన రైతాంగ విధానాలతో ధాన్యం దిగుబడి లో తెలంగాణా రాష్ట్రం ఆల్ టైం రికార్డ్ నమోదు చేసుకుందని ఆయన పేర్కొన్నారు.ధాన్యం దిగుబడి లోనే కాదు కొనుగోలు లోనూ తెలంగాణా రాష్ట్రం ఆల్ టైం రికార్డ్ నమోదు చేసుకుందని ఆయన చెప్పారు.ఖరీఫ్ సీజన్ లో 148 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అయితే ప్రభుత్వం రైతుల నుండి 72 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందన్నారు.ప్రభుత్వం రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యానికి మద్దతు ధర తో పాటు బోనస్ లను కలుపుకుని 19,000 వేల కోట్లు చెల్లించిందన్నారుకాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సాధించిన అద్భుతమైన విజయాలను ప్రస్తావిస్తూ వీటన్నింటినీ గమనిస్తున్న ప్రజలు పురపాలక సంఘాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేందుకు సన్నద్ధమతున్నారని ఆయన చెప్పారు.సమన్వయంతో పనిచేస్తే సూర్యాపేట పురపాలక సంఘం ఎన్నికల్లో విజయం సాదించేది ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీనే నన్నారు.కాంగ్రెస్ పార్టీ పై ప్రజాలకు విశ్వసనీయత పెరుగుతోందని అందులో సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ కు కంచుకోటగా నిలిచిందన్నారు.మొన్నటి లోకసభ ఎన్నికల్లో సూర్యాపేట జిల్లాల్లోని నాలుగు శాసనసభ నియోజకవర్గాలలో వచ్చిన మెజారిటీ దేశంలో మరెక్కడా రాలేదన్నారు.వర్తక,వ్యాపార ,వాణిజ్య వర్గాలకు కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి వెన్నుదన్నుగా నిలిచిందన్నారు.బడుగు బలహీన, ముస్లిం మైనారిటీ వర్గాల అభ్యున్నతికి అవిరళ కృషి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఆయా వర్గాలు మద్దతు పలకాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.
