Breaking News

కె కె స్వర హాస్పిటల్ ఉచిత మెగా హెల్త్ క్యాంప్ ని ప్రారంభించిన బీసు ధనలక్ష్మి చందర్

యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 09, ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదాద్రి భువనగిరి జిల్లా,ఆత్మకూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో కె కె స్వర హాస్పిటల్ బోడుప్పల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా హెల్త్ క్యాంప్ ని గ్రామ సర్పంచ్ బీసు ధనలక్ష్మి చందర్ గౌడ్ ప్ర్రారంభించారు.ఈ హెల్త్ క్యాంప్ లో గుండె, ఎముకలు, నరాలు, కన్ను చెవి ముక్కు, గొంతు, దంతాలు మరియు జనరల్ మెడిసన్ వివిధ రకాల ఉచిత పరీక్షలు నిర్వహించి రోగులకు ఉచిత మందుల పంపిణీ చేసి చెకప్ కి వచ్చిన ప్రతి ఒక్కరికి గుండెకు సంబంధించిన హెల్త్ కార్డుఇచ్చారు.ఈ సందర్భంగా తరలివచ్చిన గ్రామ ప్రజలకు అదేవిధంగా ఇంత పెద్ద హెల్త్ క్యాంప్ ని మన ఆత్మకూరు(ఎం)లో నిర్వహించినందుకు ఆస్పత్రి యజమాన్యానికి సర్పంచ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బీసు చందర్ గౌడ్,వార్డు సభ్యులు గడ్డం సతీష్, బూడిద శేఖర్, ఎలగందుల సైదులు నేతాజీ యువజన మండలి అధ్యక్షులు దొంతరబోయిన మురళీకృష్ణ, సభ్యులు గుండెగాని కిరణ్, లోడి శ్రీనివాస్ గర్దాసు లింగయ్య,డాక్టర్లు జీఎం శ్రీకాంత్, నవీన్, స్నేహ, రోహిత్, కుమార్,మార్కెటింగ్ టీమ్ మేనేజర్ స్వామి,టీమ్ భాస్కర్, భాను,తదితరులు పాల్గొన్నారు…

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు

పోక్సో కేసులో హైకోర్టును ఆశ్రయించిన బండి భగీరథ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *