Breaking News

ప్రజల కోసం పోరాడే సిపిఎం అభ్యర్థి వల్లపు దాసు సాయికుమార్ ను గెలిపించండి.

అవినీతిపరులను, అవకాశవాదులను ఓడించండి.
డబ్బు, మద్యంనికి లొంగకుండా స్వేచ్ఛగా ఓటెయ్యండి.
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి

సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

సూర్యాపేట, నేటి తెలుగు పత్రిక: నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడే సిపిఎం అభ్యర్థి వల్లపు దాసు సాయి కుమార్ ను అధిక మెజార్టీతో గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి అన్నారు. సోమవారం మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 24 వ వార్డు సిపిఎం అభ్యర్థి వల్లపు దాసు సాయికుమార్ ను గెలిపించాలని కోరుతూ ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రచార సభలో ఆమె మాట్లాడుతూ 24 వ వార్డు సిపిఎం అభ్యర్థి వల్లపు దాసు సాయికుమార్ గత 20 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో కార్మికులు, కష్టజీవులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం అనేక ఉద్యమాలు చేశారని అన్నారు. శివారు ప్రాంతాల అభివృద్ధి కోసం అనేక పోరాటాలు, ఉద్యమాలు చేశారని అన్నారు. సాయికుమార్ గెలిస్తే వార్డు సమస్యలే కాకుండా సూర్యాపేట మున్సిపాలిటీలో పేదలు, కార్మికుల సమస్యలపై మున్సిపల్ కౌన్సిల్ లో ప్రజా సమస్యలపై గళం విప్పుతారని అన్నారు. డబ్బు, మద్యం ప్రభావానికి గురికాకుండా ప్రజలందరూ స్వేచ్ఛగా స్వేచ్ఛగా ఓటు వేయాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. 24వ వార్డులో అనేక సమస్యలు ఉన్నాయని ఆ సమస్యలు పరిష్కారం కావాలంటే ప్రజల కోసం సేవ చేసి వారు మాత్రమే ఆ సమస్యలు పరిష్కరిస్తారని అన్నారు. గతంలో 24వ వార్డులో కౌన్సిలర్ గా గెలిచిన సిపిఎం నాయకులు ఎల్గూరి గోవింద్, జ్యోతి వార్డు అభివృద్ధికి ఎంతో కృషి చేశారని అన్నారు. వారి వారసుడిగా ఈ ఎన్నికల్లో సిపిఎం తరపున వల్లపు దాసు సాయికుమార్ పోటీ చేస్తున్నారని ఆయన గుర్తు సుత్తి కొడవలి నక్షత్రం పై అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని అన్నారు. ఈ ఎన్నికల్లో అవినీతిపరులను, అవకాశవాదులను ఓడించాలని, నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే సిపిఎం అభ్యర్థి సాయికుమార్ ను గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు, కోట గోపి,సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎల్గూరి గోవింద్, వేల్పుల వెంకన్న, ధనియాకుల శ్రీకాంత్, వీరబోయిన రవి, మద్దెల జ్యోతి, సిపిఎం సీనియర్ నాయకులు అబ్బ గాని బిక్షం, బొమ్మిడి లక్ష్మీనారాయణ, చెరుకు సత్యం, పట్టణ నాయకులు షేక్ సైదులు, టేకుల సుధాకర్, మాద గాని మల్లేష్, పటాన్ మహబూబ్ అలీ, యాతాకుల ప్రవీణ్, పిట్టల రాణి, భాగ్యమ్మ, శశిరేఖ, ఎలుగూరి దశరథ, ఆశాలు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

పీహెచ్ సి లో చికిత్స పొందుతున్న బాలికలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *