Breaking News

న్యాయవాదులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించాలి…!

విజయవాడ.ఫిబ్రవరి 9 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ను రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని బెజవాడ బార్ అసోసియే షన్ అధ్యక్షులు ఏకే భాషా వెల్లడించారు. న్యాయవాదులపై దాడులు చేసి చంపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అడ్వకేట్ స్వప్న దాడి నేపథ్యంలోనే ప్రాణాలు కోల్పోయిందన్నారు.కేవలం పోలీసుల వైఫల్యం వల్లే ఆమెపై దాడి జరిగిం దని వెల్లడించారు.ఈ సందర్భంగా సోమవారం బెజవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులు, న్యాయవాది స్వప్న హత్యకు నిరసనగా కోర్టు విధులను బహిష్కరించి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ మేరకు బెజవాడ భార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏకే భాష మాట్లాడుతూ న్యాయవాద వృత్తిలో న్యాయం కోసం పోరాటం చేస్తున్న న్యాయవాదులపై దాడులు చేసి చంపుతున్నారన్నారు. దాడి నేప థ్యంలోని న్యాయవాది స్వప్న ప్రాణాలు కోల్పోయిందన్నారు. న్యాయవా దులపై దాడులు ఆపేందు కు ప్రభుత్వాలు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురా వాలన్నారు. న్యాయవాదు లు న్యాయం కోసం పోరాటం చేస్తున్నారని, వారిపై దాడులు చేయడం సరి అయిన విధానం కాదన్నారు. స్వప్న పై దాడి కేవలం పోలీసుల వైఫల్యం వల్లే జరిగిందన్నారు. అనంతరం స్వప్న చిత్రపటానికి పూల మాలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఉయ్ వాంట్ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటూ నినాదాలు చేశారు.

ఉగాది పురస్కారాలకు 2026 దరఖాస్తుల ఆహ్వానం.

భూపతి చంద్ర” స్మారక కథానికల పోటీ, తృతీయ విజేతగా కృష్ణమూర్తి !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *