Breaking News

⚠️ చిత్తూరులో బర్డ్ ఫ్లూ కలకలం.. వేలాది కోళ్ల మృతి.. గుడ్లు, చికెన్ అమ్మకాలపై నిషేధం.

నేటి తెలుగు పత్రిక: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే సదుం మండలంలోని పలు గ్రామాల్లో బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావగా, ఇప్పుడు కార్వేటి నగర్ ప్రాంతంలోనూ ఈ మాయ రోగం కలకలం రేపుతోంది. RKV పేట, ఇందిరా కాలనీ పరిధిలోని కోళ్ల ఫారాల్లో వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడినట్లు జిల్లా యంత్రాంగం గుర్తించింది.

సిపిఎం నేతకు నివాళులు.

సోమవారం (ఫిబ్రవరి 9) ఒక్క రోజులోనే వెయ్యికి పైగా కోళ్లు మరణించడంతో స్థానికులు, పౌల్ట్రీ ఫారం యజమానులు అధికారులకు సమాచారం అందించారు. వెంటనే విషయం కలెక్టర్ దృష్టికి చేరడంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. పశుసంవర్ధక శాఖ అధికారులను వెంటనే ఘటనా స్థలానికి పంపించి కోళ్ల ఫారాలను పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు.మరణించిన కోళ్లను జేసీబీల సహాయంతో పెద్ద గోతులు తవ్వి శాస్త్రీయ పద్ధతిలో పూడ్చి వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కోళ్ల సామూహిక మరణాలకు గల కారణాలపై ప్రాథమిక విచారణ ప్రారంభించారు. వ్యాధి నిర్ధారణ కోసం కోళ్ల రక్త నమూనాలను భోపాల్‌లోని ల్యాబ్‌కు పంపించారు. తుది నివేదిక వచ్చే వరకు కోడి గుడ్లు, చికెన్ అమ్మకాలు నిషేధించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అలాగే కోళ్ల ఫారాల పరిధిలోకి ఇతరులు, వాహనాలు ప్రవేశించకుండా కట్టుదిట్టమైన ఆంక్షలు అమలు చేయాలని ఫారం యజమానులకు సూచించారు. బర్డ్ ఫ్లూ భయంతో జిల్లా యంత్రాంగం ప్రత్యేక రాపిడ్ రెస్పాన్స్ టీంను ఏర్పాటు చేసింది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది. టెలీకాన్ఫరెన్స్ ద్వారా మండల స్థాయి అధికారులను అప్రమత్తం చేసిన కలెక్టర్ సమిత్ కుమార్, ఆరోగ్యశాఖతో పాటు పశుసంవర్ధక శాఖ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.చిత్తూరు జిల్లాలో వేల సంఖ్యలో పౌల్ట్రీ ఫారాలు, లక్షల సంఖ్యలో కోళ్ల పెంపకం కొనసాగుతున్న నేపథ్యంలో బర్డ్ ఫ్లూ విస్తరిస్తే కోళ్ల పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తీసుకుంటున్న చర్యలపై ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తున్నట్లు వెల్లడించారు.

సిరిపురంలో మెగా కంటిశస్త్ర శిబిరం !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *