బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నో ఎంట్రీ!

16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నో ఎంట్రీ!

సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం – కొత్త చట్టానికి కసరత్తు ప్రారంభం.

నేటి తెలుగు పత్రిక: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలతో సంచలనం సృష్టించారు. మహిళల భద్రత ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అని స్పష్టం చేసిన సీఎం, ఈ విషయంలో పోలీసులు ఏమాత్రం అలసత్వం వహించకూడదని ఆదేశించారు. నిన్న నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో డీజీపీకి ప్రత్యేక సూచనలు చేస్తూ… మహిళల రక్షణ విషయంలో కఠినంగా వ్యవహరించాలని తేల్చిచెప్పారు.అలాగే సోషల్ మీడియా ప్రభావంపై కూడా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. 16 ఏళ్ల లోపు పిల్లలు, యువత సోషల్ మీడియా వాడకం వల్ల తప్పుదోవ పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా బ్యాన్ చేసేలా కొత్త చట్టం తీసుకురావడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోందని ప్రకటించారు.ఈ చట్టం రూపకల్పనలో భాగంగా ఆస్ట్రేలియాలో అమలులో ఉన్న సోషల్ మీడియా చట్టాన్ని అధ్యయనం చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. అవసరమైతే భారత పరిస్థితులకు అనుగుణంగా మరింత కఠిన నిబంధనలు తీసుకువస్తామని సూచించారు.మహిళల భద్రతతో పాటు పిల్లలు, యువత భవిష్యత్తును కాపాడేందుకే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నామని సీఎం స్పష్టం చేశారు. త్వరలోనే ఈ అంశంపై స్పష్టమైన విధాన ప్రకటన వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు