బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

నేడే పోలింగ్..! కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి

నేడే పోలింగ్..! కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి

బెల్లంపల్లి, ఫిబ్రవరి 10:(నేటి తెలుగు పత్రిక): నేడు బుధవారం జరగనున్న రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసింది. మంగళవారం సాయంత్రమే ఎన్నికల సామాగ్రితో సిబ్బంది తమకు కేటాయించిన వాహనాల్లో కేంద్రాలకు తరలి వెళ్లారు. బెల్లంపల్లి మున్సిపల్ పరిధిలోని 34 వార్డులకు సంబంధించి స్థానిక బజార్ ఏరియా లోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రం తో పాటు 13 న నిర్వహించే ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. మంగళవారం ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించి ఎన్నికల అధికారులు, సిబ్బందికి సూచనలిచ్చారు. పోలింగ్ కేంద్రం పరిధిలోని ఓటర్లకు ఓటర్ స్లిప్పులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈసారి ఎన్నికల విధుల్లో పోలీసు శాఖతో పాటు అటవీ, ఆబ్కారి సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. రాజకీయ పార్టీలు, పోటీలో ఉన్న అభ్యర్థులు ఎన్నికల నిబంధనలను పాటించాలని సూచించారు. ఓటర్లను ప్రలోభ పెట్టే చర్యలకు పాల్పడితే వారిపై కేసులు నమోదు చేసి ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. బెల్లంపల్లి మున్సిపల్ పరిధిలో 34 వార్డుల్లో 68 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఒక్కో కేంద్రానికి ఒక పిఓ, ఒక ఏపీఓ, ముగ్గురు ఓపిఓలను రాండమైజేషన్ ప్రక్రియ ద్వారా అధికారుల బృందాలను కేటాయించినట్లు చెప్పారు. ఈ ఎన్నికల్లో బెల్లంపల్లిలో44,575 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 340 మంది పోలింగ్ సిబ్బంది,200 మంది పోలీస్ సిబ్బందిని నియమించారు.ఎన్నికల నిర్వహణకు జోనల్, నోడల్ అధికారులు, వీడియో స్టాటస్టిక్ సర్వేయ లెన్స్ బృందాలు, మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ ,మీడియా సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో 800 మంది ఓటర్లకు మించకుండా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పోలింగ్ రోజు ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. పోలింగ్ రోజు పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల వరకు ఎన్నికల నిబంధనలు అమలులో ఉంటాయన్నారు. పోలింగ్ సిబ్బందికి కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు