Breaking News

ఈనెల 12న జరుగు దేశ వ్యాప్త సమ్మె జయప్రదం కోసం పరిశ్రమల వద్ద సిఐటియు కరపత్రాలు, బుక్లెట్స్ ద్వారా విస్తృత ప్రచారం.

  • 12న పరిశ్రమలు బంద్ చేయాలి – కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొనాలి.
  • సిఐటియు జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి పిలుపు.

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 11 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): కార్మికులకు నష్టం చేసే నాలుగు లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 12న జరుగనున్న దేశవ్యాప్త సమ్మెలో భువనగిరి పట్టణం, మండలంలో పరిశ్రమలు బంద్ చేసి స్వచ్ఛందంగా కార్మికులు పట్టణ కేంద్రంలో జరుగు ప్రదర్శన, సభలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మండలంలోని ఏజీఐ గ్లాస్ ప్యాక్, ఇండస్ట్రీయల్ పార్క్ లో కార్మికులను కలిసి సిఐటియు నాయకత్వం కరపత్రాలు, బుక్లెట్స్ ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దుచేసి కార్పొరేట్ శక్తులకు, పెట్టుబడిదారులకు అనుకూలంగా కొత్తగా నాలుగు లేబర్ కోడ్స్ తెచ్చిందని అన్నారు. ఈ లేబర్ కోడ్స్ అమలు జరిగితే కార్మికులు అధునాతన బానిసలుగా మారే ప్రమాదం ఉన్నదని అన్నారు. సంఘం పెట్టుకునే హక్కు గాని, సమ్మె చేసే హక్కు గాని లేకుండా చేసిందని అన్నారు. యాజమాన్యాల దయా దాక్షిణ్యాల మీద ఆధారపడవలసి వస్తున్నదని అన్నారు. రోజుకు 8 గంటల స్థానంలో 12 గంటల పని విధానాన్ని ముందుకు తెస్తుందని అన్నారు.పీఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్, గ్రాడ్యుటి లాంటి సంక్షేమ పథకాలు రానున్నకాలంలో కనుమరుగయ్యే ప్రమాదం ఉన్నదని తెలిపారు. ఉద్యోగ భద్రత లేకుండా కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయిమెంట్, ట్రైనీ, అప్రెంటిషిప్ లాంటి పద్దతుల్లో వర్కర్స్ ని వివిధ కేటగిరీస్ గా పరిశ్రమల్లోకి తీసుకొని అవసరం ఉన్నప్పుడు పని చేయించుకొని, అవసరం లేనప్పుడు తీసేసేందుకు యాజమాన్యాలకు ఎక్కడలేని రెక్కలు వచ్చే విధంగా లేబర్ కోడ్స్ రూపొందించారని అన్నారు. కార్మికులు భయం, భయంతో పనిచేయాల్సిన పరిస్థితులు దాపురిస్తాయని అన్నారు. అందుకే కార్మికులకు నష్టం చేసే నాలుగు లేబర్ కోడ్స్ ను రద్దుచేసి పాత కార్మిక చట్టాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 12న జరుగు దేశవ్యాప్త సమ్మెలో భువనగిరి మండలం, పట్టణంలోని పరిశ్రమల కార్మికులతో పాటు అన్ని రంగాల కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దాసరి పాండు, మాయ కృష్ణ, లావుడియా రాజు, ఈర్ల రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

పాషా బాయ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్

పెన్షనర్ల హక్కులకై పోరాటo

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *